సీఎం కేసీఆర్ ప్రచార సభలో బుల్లెట్ల కలకలం..!!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్( CM KCR ) బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారనికి  చివరి తేదీ నవంబర్ 28 కావటంతో ఇంకా కేవలం 12 రోజులు మాత్రమే ఉండటంతో.

కేసీఆర్ వరుసగా.బహిరంగ సభలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్( Narsapur ) లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొనగా బుల్లెట్లు కలకలం రేపాయి.దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అస్లామ్ అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Advertisement

ఈ క్రమంలో అస్లాంని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల బీఆర్ఎస్ నాయకులపై ఇటీవల దాడులు జరిగాయి.

అయితే ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభలో బుల్లెట్లు దొరకటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.నవంబర్ 30వ తారీకు ఎన్నికలు జరగనున్నాయి.

డిసెంబర్ మూడవ తారీకు ఫలితాలు రాబోతున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలలో పోటీ చాలా గట్టిగా ఉంది.

మొదటి రెండుసార్లు బీఆర్ఎస్ అలవోకగా.విజయం సాధించింది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం

అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ( Congress party ) గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు సర్వేలలో ఫలితాలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు