నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీవీ యాడ్స్‌లో ఇక కనిపించేది వారే

సాధారణంగా ఒక టీవీ యాడ్స్ లో నటించేందుకు కంపెనీలు పెద్ద పెద్ద సెలబ్రెటీలను తీసుకుంటారు.

అసరమైతే విదేశీ మోడల్స్ ని సైతం తీసుకొచ్చి యాడ్స్ తీస్తారు.

కానీ నైజీరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.స్థానిక ప్రతిభన ప్రోత్సహించాలని నిర్ణయించింది.

టీవీ కమర్షియల్ యాడ్స్ లో విదేశీ మోడల్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులను తీసుకోవడంపై పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.యాడ్స్ లో విదేశీ మాడల్స్ ను నిషేధించిన మొట్టమొదటి దేశంగా నైజీరియా అవతరించింది.

అక్టోబర్ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని అసోసియేషన్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీస్ ఆఫ్ నైజీరియా ప్రెసిడెంట్ స్టీవ్ బాబెక్ తెలిపారు.కొన్ని దశాబ్దాల క్రితం నైజీరియన్ వాణిజ్య ప్రకనటన్లో సగం మంది విదేశీ మోడల్స్ కనిపించేవారని, అన్ని వాయిస్ ఓవర్లు బ్రిటిష్ గొంతులే వినిపించేవని అన్నారు.

Advertisement
A Key Decision By The Nigerian Government They Are The Ones Who Will Appear In

ఈ నిర్ణయంతో స్థానిక ప్రజల ప్రతిభ అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

A Key Decision By The Nigerian Government They Are The Ones Who Will Appear In

ఇక ఈ నిషేధం తర్వాత విదేశీ మోడల్స్, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు అందరూ నైజీరియా దేశంలో పనిచేయలేరు.నైజీరియా దేశం తీసుకున్న ఈ నిర్ణయం భారీ సాంస్కృతిక మార్పునకు కారణం అవుతుందనే చర్చ జరుగుతోంది.ఇక, ప్రముఖ యాడ్ ఏజెన్సీ అయిన AMV BBDO ఈ మార్పును స్వాగతించిన మొదటి కంపెనీగా నిలిచింది.

స్థానిక బీర్ బ్రాండ్ గిన్సిస్ లో ‘బ్లాక్ షైన్స్ బ్రైటెస్ట్’ ప్రచారాన్ని షూట్ చేయడానికి స్థానిక మోడల్స్, డైరెక్టర్స్ ని ఉపయోగించింది.ఈ కొత్త మార్పును ఆహ్వానించిన మొదటి కంపెనీగా ఇది నిలిచింది.

ఒకవేళ కంపెనీలు తమ వాణిజ్య ప్రకటనల్లో విదేశీ మోడల్స్ ని ఉపయోగించుకోవాలంటే ముందుగా 1,00,000 నైరా( అంటే సుమారు 20 వేల రూపాయలు) రుసుం చెల్లించాల్సి ఉంటుందని నైజీరియాలో ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు