బుల్లితెరపై మంచి ప్రేక్షకదారణతో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు అభిమాన సీరియల్ గా మారింది.
సెలబ్రెటీలు సైతం ఈ సీరియల్ కు ఎంతలా వాలిపోయారో చూసాం.ఇక ఈ సీరియల్ మొదటి నుండి ఒకే కథతో కొనసాగిన కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక రేటింగ్ లో మాత్రం ఈ సీరియల్ ని మించిన మరో సీరియల్ లేదని చెప్పాలి.అంతేకాకుండా ఏ స్టార్ హీరోల సినిమాలు వచ్చినా కూడా ఈ సీరియల్ కంటే ఎక్కువ రేటింగ్ సొంతం చేసుకోలేకపోయాయి.
ఎందుకంటే ఈ సీరియల్ కు అంత క్రేజ్ ఉందన్న మాట.ఇక ఇందులో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, సౌందర్య, మోనిత పాత్రలకు బాగా ఆకర్షితులయ్యారు అభిమానులు.వీరు తమ నటనలతో భలే గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక వీరి గురించి ఏ వార్త వచ్చిన వైరల్ గా మారుతుంది.
ఇక వీరికి ఈ సీరియల్ ద్వారానే మంచి అభిమానం పెరిగింది.గత కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్ రేటింగ్ బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే.

కారణం ఈ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు చనిపోయిన తర్వాత చిన్న పాత్రలు పెద్దవారిగా మారిన సంగతి తెలిసిందే.దీంతో ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు లేకపోయేసరికి ఈ సీరియల్ మొత్తం డీలాపడింది.దీంతో డైరెక్టర్ మళ్ళీ చనిపోయిన వంటలక్కను, డాక్టర్ బాబును తీసుకువచ్చి మళ్ళీ మునుపటి రేటింగు సొంతం చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సీరియల్ నుండి ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది.
అదేంటంటే.గతంలో దీప, కార్తీక్ కు యాక్సిడెంట్ అయిన తర్వాత జరిగిన సంఘటనే ఇప్పుడు చూపిస్తున్నాడు డైరెక్టర్.
కానీ ఇంతకుముందు పెద్ద పాత్రలతో చూపించాడు డైరెక్టర్.శౌర్య, హిమ లను పెద్దవాళ్లుగా మార్చి వాళ్ల ప్రేమలను చూపించాడు.
కానీ ఇదంతా కల అని ప్రస్తుతం వార్త వినిపిస్తుంది.

అదేంటి ఇంతకాలం జరిగింది కలనా అంటూ కార్తీకదీపం అభిమానులు షాక్ అవుతున్నారు.నిజానికి చాలా రోజులు పెద్దవాళ్లుగా చూపించగా ఇక చిన్న వాళ్ల పాత్ర ముగిసింది అని అందరూ అనుకున్నారు.కానీ తాజాగా ఆ పెద్ద వాళ్ళ పాత్రలు అన్ని కల అంటూ పెద్ద షాక్ ఇచ్చారు.
అంటే ఇకపై ఈ చిన్న పాత్రలతోనే డైరెక్టర్ మళ్లీ కథను సాగదీస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.పైగా ప్రస్తుతం మోనిత రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇంకేముంది కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టే.ఇక మళ్లీ ఇదే కథ సాగితే ప్రేక్షకులు ఈసారి ఈ సీరియల్ ను చూడటమే మానేస్తారని చెప్పాలి.