అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు ఆప‌న్న హ‌స్తం.. న్యాయ నేత్రం స్వ‌చ్ఛంద సంస్థ చేయూత‌

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా ములుగు నియోజ‌క వ‌ర్గం మంగ‌పేట మండ‌లం శ‌నిగ‌కుంట‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగి సుమారు 50 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

ఈ ప్ర‌మాదంలో గిరిజ‌నులు స‌ర్వం కోల్పోయారు.

క‌ట్టుబ‌ట్ట‌లు, క‌న్నీళ్లు త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు.వాళ్లు ఆరుగాలం క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్నది మొత్తం అగ్నికి ఆహుత‌య్యింది.

క‌ట్టుకోవ‌డానికి బట్ట‌లు కూడా లేని ప‌రిస్థితి.ప్ర‌భుత్వ సాయం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, వారికి అంద‌డంలో జాప్యం జ‌రుగుతోంది.

వార్త తెలుసుకున్న ఖ‌మ్మం జిల్లాకు చెందిన‌ న్యాయ నేత్రం స్వ‌చ్ఛంద సంస్థ టీం గిరిజ‌నుల‌కు చేయూత ఇచ్చేందుకు ముంద‌డుగు వేసింది.స్వ‌చ్ఛంద సంస్థ న‌డిపిస్తున్న మిత్రుల స‌హాయంతో వారికి దుస్తులు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు.300 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న శనిగకుంట‌కు వెళ్లి, అగ్ని ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, అగ్ని ప్ర‌మాధం జ‌రిగిన విధానం తెలుసుకున్నారు.బాధితుల‌కు త‌మ న్యాయ నేత్రం త‌రపున దుస్తులు పంచిపెట్టారు.

Advertisement

ఊహించ‌ని అగ్ని ప్ర‌మాద‌లో స‌ర్వం కోల్పోయిన వారిని చూసి చ‌లించి ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చామ‌ని, న్యాయ నేత్రం స్వ‌చ్చంద సంస్థ చైర్మ‌న్ అయిత‌గాని జ‌నార్ధ‌న్ అన్నారు.కార్యక్ర‌మంలో స్వ‌చ్చంద సేవ‌కులు, బీకే చంద్ర శేఖ‌ర్‌, శ్రీవిద్య‌, ప్ర‌మీల‌, బాసిపొంగు క‌విత‌, శ్రీనివాస్‌, సుద‌ర్శ‌న్‌, చ‌ల‌ప‌తి, సూర్య‌నారాయ‌ణ‌, రంజిత్‌, సీతారాములు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Age Verification Checks & Poker Math Fundamentals For UK High Rollers
Advertisement

Latest Khammam News