అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 రోజులు బ్యాటరీ లైఫ్

మార్కెట్‌లో రకరకాల ఫోన్లు వస్తున్నాయి.వాటిలో కొన్ని కెమెరాలపై ఫోకస్ చేస్తే మరికొన్ని కంపెనీలు భద్రతపై దృష్టి పెడతాయి.

అయితే కింద పడినా పగలని, నీటిలో పడినా పాడవని ఫోన్‌లను డూగీ సంస్థ తయారు చేస్తోంది.తాజాగా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.

డూగీ V30 పేరుతో కొత్త ఫోన్ అందుబాటులోకి తెచ్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

దానికి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 2,408 X 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఉన్నాయి.120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్ అవుతుంది.ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌ను అమర్చారు.

Advertisement

ఇది 6 ఎన్ఎం నోడ్ ఆధారంగా, 5G ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది.

ఫోన్ బేస్ కాన్ఫిగరేషన్ పరిశీలిస్తే 8 జీబీ ర్యామ్ ఉంది.ఇక దీనిలో అంతర్గత మెమొరీ 256 జీబీ ఉంటుంది.మైక్రో ఎస్‌డీ కార్డుతో అంతర్గత మెమొరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో 10,800 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ అమర్చారు.ఏకధాటిగా 18 గంటల టాక్ టైమ్‌ను అందింస్తుంది.

ఇది గరిష్టంగా 40 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుంది.ఇందులో 108 ఎంపీ కెమెరా, 20 ఎంపీ నైట్ విజన్ కెమెరా, 16 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఇలా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంటాయి.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?

ముందు వైపు 32 ఎంపీ సోనీ IMX616 సెన్సార్ సెల్ఫీ కెమెరా ఉంది.డూగీ వీ 30 దాని ప్రధాన కెమెరాతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల ఫ్రేమ్ రేట్‌తో 4K కంటెంట్‌ను క్యాప్చర్ చేయగలదు.

Advertisement

అయితే దాని నైట్ విజన్ కెమెరా మోనోక్రోమ్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల ఫ్రేమ్ రేటుతో 4K కంటెంట్‌ను క్యాప్చర్ చేయగలదు.ఈ ఫోన్‌కు హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్‌లను అందిస్తుంది.

దాని పటిష్టతను రుజువు చేసే MIL-STD-810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది.

తాజా వార్తలు