మన భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి.ప్రతి దేవాలయానికి ఏదో ఒక చరిత్ర ఉంటుంది అని పెద్దలు చెబుతుంటారు.
అలాంటి దేవాలయాల్లోని శ్రీ వజ్రేశ్వరి దేవాలయం( Sri Vajreshwari Temple ).ఈ ఆలయంలో భైరవుని చిన్న ఆలయం ఉంది.
భైరవుని విగ్రహం కళ్ళ నుండి అప్పుడప్పుడు కన్నీరు కూడా వస్తూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.అయితే హిమాచల్ లోని ప్రసిద్ధ శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని నాగర్కోట్ దేవి కాంగ్రా దేవి అని కూడా పిలుస్తారు.
అయితే ఈ దేవతకు అంకితం చేయబడిన 51 శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి.ఈ ఆలయం ధర్మశాల నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్కోట్ పట్టణంలోని కాంగ్రాలో( Nagarkot ) ఉంది.
ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిది.భక్తులు దూరం నుండి ఈ ఆలయంలోని బంగారు కలశాన్ని చూడవచ్చు.ఈ గుడికి భక్తులు వివిధ ప్రాంతాలలో నుండి తరలి వస్తూ ఉంటారు.అయితే ఈ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది.పురాణాల ప్రకారం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం జరిగినప్పుడు భైరవుని విగ్రహం( Bhairava Statue ) కళ్ళ నుండి కన్నీరు కారుతుంది అని పండితులు చెబుతున్నారు.పండితులు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారు.
అయితే భైరవ స్వామి కన్నీళ్ళ వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పటికీ కూడా బయటికి రాలేదు.అయితే పూర్వం దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందర్నీ ఆహ్వానిస్తాడు.
కానీ కూతుర్ని, అల్లుడిని మాత్రం ఆహ్వానించడు.దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడుతుంది.
సతీదేవి శివుడు వారించినా వినకుండా అనుచర గుణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది.కానీ అక్కడ అవమానానికి గురైంది.
అయితే సతీదేవి తండ్రి దక్షుడు శివుడిని అల్లుడని కూడా చూడకుండా దుర్భాషలాడడంతో సహించలేక ఆమె అక్కడున్నా అగ్నిలో దూకి తనను తాను దహనం చేసుకుంది.దీంతో ఆగ్రహించిన శివుడు( Lord Shiva ) తన గణాలతో యాగశాలను చేశాడు.ఆ తర్వాత శివయ్య తన భార్య సతీదేవి( Sathidevi ) మృతదేహాన్ని భుజంపై వేసుకొని విశ్వం చుట్టూ తిరుగుతూ చేయవలసిన కార్యాన్ని మానివేశాడు.అయితే దేవతలందరూ కలిసి శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి చర్చించగా.
విష్ణువు సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించాడు.అప్పుడు ఆమె శరీర భాగాలు భూమి మీద రకరకాల ప్రదేశాల్లో పడడం జరిగింది.
అయితే సతీదేవి శరీర భాగం ఎక్కడపడితే అక్కడ శక్తి పీఠంగా ఏర్పడింది.ఈ విధంగా సతి ఎడమ రొమ్ము పడిపోయిన ప్రదేశం వజ్రేశ్వరి ఆలయముగా ఉద్భవించింది.
LATEST NEWS - TELUGU