అయోధ్య నగరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ఈ మహోన్నత ఘట్టం జరగగా బాలరాముడు కొలువుదీరితే యావత్ భారతం పులకించిపోయింది.
మల్టీప్లెక్స్ ల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా దేశంలోని ప్రజలు ప్రాణప్రతిష్ట వేడుకను చూశారు.అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది.
కోట్ల సంఖ్యలో ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్య నగరంలో అపురూప రామమందిరం ఆవిష్కృతమైంది.రామ నామంతో అయోధ్య రామ మందిరం ( Ayodhya Ram Mandir )మారుమ్రోగింది.
అధ్యాత్మిక శోభతో అయోధ్య నగరమంతా కళకళలాడింది.దేశ విదేశాలకు చెందిన 7 వేల మంది ప్రముఖులు, స్వామీజీలు ఈ మహత్కార్యానికి హాజరయ్యారు.
ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీరాముడు ( Lord Rama )భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అధికారులు అయోధ్య నగరమంతా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ప్రాణప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా చూసిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు( Movie, political and sports celebrities ) పులకించిపోయారు.అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరగడంతో 500 సంవత్సరాల హిందువుల కల సాకారమైంది.
ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆలయంపై నుంచి హెలికాప్టర్లతో పూల్ వర్షం కురిపించారు.జై శ్రీరామ్ నినాదంతో కోట్ల సంఖ్యలో హిందువులు పులకరించిపోయారు.
బాలరాముడు ధనస్సు ధరించి కమలంపై కొలువుదీరిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు.సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.అయోధ్యకు వేర్వేరు రంగాల సినీ ప్రముఖులు హాజరయ్యారు.ముఖేష్ అంబానీ దంపతులు కూడా అయోధ్యకు చేరుకున్నారు.అయోధ్యలో రామాయణ ఘట్టాలను వివరిస్తూ పలువురు గాయకులు గీతాలను ఆలపిస్తున్నారు.
పలువురు ప్రముఖ సినీ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
LATEST NEWS - TELUGU