బోలెడంత అందం ఉంది కానీ అవకాశాలు మాత్రమే లేవు !

తెలుగు సినిమాల్లో నటించాలంటే బోలెడంత అందం, అందానికి తగ్గ ఆహార్యం, అంతే తెలివి తేటలు మరి మఖ్యంగా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి.ఇవన్నీ ఉండి కూడా కొంత మందికి మొదట్లో అవకాశాలు వచ్చి ఇప్పుడు అవి సరిగ్గా వినియోగించుకోలేక టాలీవుడ్ నుంచి కనుమరుగై పోతున్నారు కొందరు హీరోయిన్స్.

 Tollywood Forgetting These Heroines, Rithu Varma, Varsha Bollamma , Karnataka, S-TeluguStop.com

అలా తెలుగు నుంచి మెల్లిగా మాయం అయిపోయిన హీరోయిన్స్ చాల మంది ఉన్నారు.ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలతో తళుక్కుమని ఇప్పుడు అవకాశాలు సంపాదించుకోలేక కనుమరుగై పోతున్నారు కొంతమంది.

మరి ఆ హీరోయిన్స్ ఎవరు వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Karnataka, Pelichoopulu, Rithu Varma, Standup Rahul, Tollywood, Varsha Bo

వర్ష బొల్లమ్మ

కర్ణాటక( Karnataka ) లో పుట్టిన ఈ చిన్నది తమిళ సినిమాల ద్వారా తెరగేంట్రం చేసింది.వర్ష నటించిన మొదటి తెలుగు సినిమా చూసి చూడంగానే.ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయినా వర్ష( varsha ) జాను సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది.

ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ పక్కన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే చిత్రం లో నటించింది.పుష్పక విమానం సినిమాలో స్పెషల్ క్యామియోలో కనిపించిన వర్ష 2022 లో రెండు తెలుగు సినిమాల్లో నటించింది.

స్టాండప్ రాహుల్ ( Standup Rahul )మరియు స్వాతిముత్యం చిత్రంలో కనిపించిన వర్ష మళ్లి ఒక ఏడాది కాలంగా ఏ చిత్రంలోనూ నటించలేదు.తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా ఆమె మళ్లి సినిమాలు తీయడం లేదు .దాదాపు ఈ దెబ్బతో వర్ష కెరీర్ ముగిసిపోయింది అని అంతా అనుకుంటున్నారు.

Telugu Karnataka, Pelichoopulu, Rithu Varma, Standup Rahul, Tollywood, Varsha Bo

రీతూ వర్మ

ఈ హీరోయిన్ పక్క తెలుగు అమ్మాయి.మన ఇండస్ట్రీ లో తెలుగు వారికి పెద్దగా అవకాశాలు ఇవ్వరు.కానీ రీతూ వర్మ( Ritu Verma ) మొదట్లో బాగానే సక్సెస్ అయ్యింది.

బాద్షా సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ తో మంచి పేరు కూడా తెచ్చుకుంది.పెళ్లిచూపులు సినిమా ఆమెకు ఒక సాలిడ్ బ్రేక్ ని కూడా ఇచ్చింది.2022 లో ఒకే ఒక జీవితం అనే సినిమా ఆమె తెలుగులో చేసిన చివరి సినిమా.అప్పటి నుంచి తమిళ్ లో కొన్ని సినిమాలు చేసిన తెలుగు వారు మాత్రం ఆమెను పక్కన పెట్టేసారు.

ఒక్క సినిమా కూడా ఈ ఏడాది లో చేయకపోగా వచ్చే ఏడాది కూడా రీతూ నటించే ఏ సినిమా కూడా లేదు.మరి ఆల్మోస్ట్ రీతూ వర్మ ఇక తెలుగు వారికి కనుమరుగయ్యే నటి లిస్ట్ లో చేరిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube