సచ్చీలత నిరూపించుకునే వరకు దూరంగానే... బీజేపీ నేత సంచలన నిర్ణయం

తెలంగాణలో బీజేపీ నేత రఘునంధనరావు మీద ఓ మహిళా అత్యాచార ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై కేసు కూడా నమోదైంది.

 Telangana Bjp Leader Quit Politicsdue To Harassment Case-TeluguStop.com

లాయర్ గా ఉన్న సమయంలో రఘునంధనరావు తనకి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసారని సదరు మహిళ చేసిన ఆరోపణల నేపధ్యంలో అవి కాస్తా రాజకీయ దుమారం రేగాయి.అయితే 2012లో తనపై రఘునంధనరావు అత్యాచారం చేసారని చెబుతున్న ఆమె మాటల్లో వాస్తవం కనిపించడం లేదు.

కాని బీజేపీ పార్టీని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్న కొంత మంది ఆ మహిళా వెనకుండి నడిపిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఆరోపణల నేపధ్యంలో రఘునంధనరావు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తనపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో కొంత కాలం రాజకీయంగా పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కి లేఖ రాసారు.

లైంగిక ఆరోపణలకి నైతిక బాద్యత వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.తనపై వేసిన కేసులో తాను నిరపరాధి అని నిరూపణ అయ్యేంత వరకు రాజకీయాలకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ నేత తన నైతికతని ఈ పనితో నిరూపించుకున్నాడని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.మరి ఈ కేసుపై కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube