టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటు ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీగా పోటీ నెలకొంది.
అయితే ఈ సినిమా గురించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో బన్నీకి సోదరి పాత్రలో నితిన్ హీరోగా తెరకెక్కిన లై, ఛల్ మోహన్ రంగా సినిమాల్లో నటించిన మేఘా ఆకాష్ నటించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.సినిమాలో బన్నీ సోదరి పాత్ర చనిపోతుందని ఆ పాత్రను సుకుమార్ మేఘా ఆకాష్ కు ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది.
బన్నీ సిస్టర్ పాత్ర కథను మలుపు తిప్పనుందని సమాచారం.
అయితే మేఘా ఆకాష్ ఈ సినిమాలో నటిస్తుందో లేదో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ చేతిలో బన్నీ సిస్టర్ చనిపోతుందని ప్రచారం జరుగుతోంది.ఇప్పటివరకు తెలుగులో మేఘా ఆకాష్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
ఈ సినిమాలో మేఘా ఆకాష్ నటిస్తే మాత్రం ఆమె తెలుగులో మరిన్ని అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 13వ తేదీన పుష్ప సినిమా విడుదల కానుంది.అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తుండగా లారీ డ్రైవర్ గా ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.