గూగుల్ పే యాప్ లో.. సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే ఆప్షన్..!

బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి సివిల్ స్కోర్ చాలా ఉపయోగం.సిబిల్ స్కోర్ మూడంకెల రూపంలో 300ల నుంచి 900 మధ్య ఉంటుంది.

 Option To Check Cibil Score In Google Pay App , Cibil Score ,financial Transacti-TeluguStop.com

సిబిల్ స్కోర్ 750 పైన ఉంటే మంచిది అని బ్యాంకు ఉద్యోగులు సైతం ఖాతాదారులకు అవగాహన కలిగిస్తున్నారు.ఖాతాదారుడు ఆర్థిక క్రమశిక్షణను సక్రమంగా పాటిస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది.

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ని సిబిల్ స్కోర్ అంటారు.

గతంలో అయితే సిబిల్ స్కోర్ పై ఎవరు దృష్టి పెట్టేవారు కాదు.

కానీ బ్యాంకుల్లో రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకునేవారు తమ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

కొందరు ఖాతాదారులు సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు.గూగుల్ పే యాప్ లో ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే సదుపాయం ఉంది.

గూగుల్ పే యూపీఐ సేవల్ని దేశమంతా విస్తరించింది.కేవలం మనీ ట్రాన్స్ఫర్ మాత్రమే కాకుండా ఇంకొన్ని సేవలను అందిస్తోంది.గతంలో పర్సనల్ లోన్ తీసుకునే సదుపాయని తీసుకొచ్చిన గూగుల్ పే తాజాగా సిబిల్ స్కోర్ ఉచితంగా చెక్ చేసుకునేలా ఆప్షన్లు ఇచ్చింది.

గూగుల్ పే లో మేనేజ్ యువర్ మనీ సెక్షన్ లో చెక్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది.తర్వాత పాన్ కార్డులో ఉన్న పేరు నమోదు చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

అంతే సులభంగా ట్రాన్స్ యూనియన్ దగ్గర మీ సివిల్ స్కోర్ స్క్రీన్ పై దర్శనం ఇస్తుంది.అయితే రుణాలు కానీ క్రెడిట్ కార్డులు కానీ తీసుకొని వారికి మాత్రమే సిబిల్ స్కోర్ అనేది ఉండదు.

రుణాలు, క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి మాత్రమే సిబిల్ స్కోర్ ఉంటుంది.గూగుల్ పే లో కూడా వేరువేరు సంస్థల ద్వారా ఐదు లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube