మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుంటారు.ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిధి రోజు మహా శివరాత్రి పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు.
మహా శివరాత్రి రోజున పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్న రోజు.ఈ రోజున పరమశివుడిని ,పార్వతిని పూజించడం వల్ల మనిషి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు.
శివుని ఆరాధనలో బిల్వపత్రం ఎంతో ముఖ్యమైనది.బిల్వపత్రం లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణమే అని చెప్పవచ్చు.మత విశ్వాసాల ప్రకారం శివునికి బిల్వపత్రం సమర్పించడం శివునికి ఎంతో ఇష్టం.అటువంటి పరిస్థితిలో మీరు కూడా శివుడికి బిల్వపత్రం సమర్పించాలని ఆలోచించినట్లయితే ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.

మూడు ఆకులతో కూడిన బిల్వపత్రం ఎప్పుడు శివలింగం పై సమర్పించాలి.దానిలో మరక లేదా మచ్చ ఉండకూడదని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.శివలింగం పై కత్తిరించిన మరియు ఎండిపోయిన బిల్వపత్రం ఎప్పటికీ సమర్పించకూడదు.శివలింగం పై బిల్వపత్రం సమర్పించే ముందు దానిని బాగా కడిగి ఆకులోని మృదువైన భాగాన్ని మాత్రమే శివలింగం పై సమర్పించాలి.

ఆకు యొక్క పొడి భాగాన్ని పైకి ఉంచండి.బిల్వపత్రం లేకపోతే అక్కడ ఉన్న ఆకులను కాడిగి మళ్ళీ శివలింగం పై సమర్పించవచ్చు.ఎందుకంటే బిల్వపత్రం ఎప్పటికీ పాతది కాదు.మీరు శివలింగం పై 11 లేదా 21 సంఖ్యలో బిల్వపత్ర లను సమర్పించవచ్చు.ఒకవేళ బిల్వపత్రం అందుబాటులో లేకపోతే అప్పుడు ఎవరైనా బిల్వ చెట్టు దర్శనం చేసుకోవడం వల్ల కూడా పాపాలు నశిస్తాయి.బిల్వపత్రం ఆకులను తీయడానికి ముందు శివుని స్మరించుకోవాలి.
శివ పూజలో ఆడవారు బిల్వపత్రం నైవేద్యంగా పెడితే అఖండ సౌభాగ్యం కలుగుతుంది.