మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పే పూలు...ఆశ్చర్యంగా ఉందా

మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు.జాతకం ఆధారంగా మాత్రం కాదు.

ఒక్కో నెలలో పుట్టిన వారికి ఒక్కో పువ్వులో ఉండే లక్షణాలు ఉంటాయి.మరి మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెలకు సంబంధించి ఒక పువ్వు పేరును, ఆ లక్షణాలను తెలుసుకుందాం.

జనవరి - కార్నేషన్ ఫ్లవర్ జనవరి నెలలో పుట్టిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.కార్నేషన్ పువ్వులలో ప్రేమ,అభిమానం ఉంటాయి.

అందువల్ల వీరు తోటి వారిని బాగా అర్ధం చేసుకుంటారు.ఫిబ్రవరి - వైలెట్ ఈ నెలలో పుట్టిన వారికీ వైలెట్ పువ్వు లక్షణాలు ఉంటాయి.

Advertisement

ఫిబ్రవరి నెలలో పుట్టినవారు లాజిక్ గా ఆలోచిస్తారు.వీరి వ్యక్తిత్వం విభిన్నంగా ఉండుట వలన ఎప్పుడు బిజీగా ఉన్నామని చెప్పుతూ ఉంటారు.

మార్చి - డాఫోడిల్ ఏదైనా కొత్త పనిని ప్రారంభించటానికి ఈ పువ్వు సింబాలిక్ గా ఉంటుంది.ఈ నెలలో జన్మించినవారికి నైపుణ్యాలు అధికంగా ఉంటాయి.

అలాగే ఇతరుల పట్ల ఆత్మీయత చూపిస్తారు.వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది.

అలాగే వీరు చేసే పనిలో నమ్మకం ఉండదు.ఏప్రిల్ - స్వీట్ పీ ఈ పువ్వు ఆనందానికి సూచికగా ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ నెలలో పుట్టినవారు చాలా ఆనందంగా ఉంటారు.వీరు పక్క వారితో కూడా చాలా ఆనందంగా గడుపుతారు.

Advertisement

అలాగే ఎక్కువగా ఆశ్చర్యానికి లోను అవుతూ ఉంటారు.మే - లిల్లీ ఈ పువ్వు మానవత్వం,స్వచ్ఛత కు ప్రతీకగా ఉంటుంది.

ఈ నెలలో పుట్టినవారు లిల్లీ పువ్వు వలే చాలా స్వచ్ఛంగా ఉంటారు.వీరు ఎక్కువగా తమలో తాము చాలా బాధపడుతూ ఉంటారు.

వీరు డిప్రెషన్ కు గురి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.జూన్ - రోజాపూలు రోజా పువ్వులు అన్ని కాలాలలోనూ దొరుకుతాయి.

ఈ నెలలో పుట్టినవారు రోజా పువ్వు వలే మంచి రొమాంటిక్ గా ఉంటారు.వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ.

వీరు అతి సన్నిహితులతోనే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.జూలై - ఫాక్స్ గ్లోవ్ ఈ నెలలో పుట్టినవారు చాలా దూకుడుగా ఉంటారు.అయితే వెంటనే మాములు స్థితికి వచ్చేస్తారు.ఆగష్టు - గ్లాడియోల్స్ ఈ పువ్వు గౌరవానికి ప్రతీకగా ఉంటుంది.

వీరు చాలా స్వతంత్రంగా ఉండి వారికీ నచ్చిన విషయాలపై ఫోకస్ పెడతారు.అనుకున్న పని అయ్యేవరకు విశ్రాంతి తీసుకోరు.

కొత్త వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం.సెప్టెంబర్ - అస్టర్ ఈ పువ్వు సహనానికి ప్రతీక.

వీరు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు.వీరికి చిన్న చిన్న ఆనందాలే సంతృప్తిని ఇస్తాయి.

వీరు కుటుంబాన్ని,స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తారు.వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు.

అక్టోబర్ - బంతిపువ్వు ఈ నెలలో జన్మించిన వారు బంతి పువ్వు వలే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు.వీరు ఎప్పుడు నిరాశకు గురి కారు.

అలాగే చుట్టూ ఉన్నవారిని కూడా నిరాశ నుండి బయట పాడేస్తారు.వీరు కుటుంబానికి ఎక్కువగా అంకితం అవుతారు.

నవంబర్ - క్రిసాన్తిమం ఈ పువ్వు ఆశావాదం, సంతోషానికి ప్రతీక.వీరు ప్రక్రుతిని ప్రేమిస్తారు.

అలాగే వీరిలో సానుభూతి కూడా ఎక్కువగా ఉంటుంది.వీరు ఒత్తిడిలో ఉన్నా సరే పక్కన ఉన్నవారిని సంతోష పెట్టటానికి ప్రయత్నిస్తారు.

వీరు ఎవరిని నొప్పించరు.డిసెంబర్ - పాన్ సెట్టియా ఈ పువ్వు దూకుడు స్వభావానికి ప్రతీక.

మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.అలాగే వీరు వయస్సులో చిన్న అయినప్పటికీ వీరి సూచనలు అమోఘంగా ఉంటాయి.

వీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.

తాజా వార్తలు