పదేళ్ల ప్రయాణం.. ఎన్నో ఎమోషన్స్.. జబర్దస్త్ సెట్ లో మంత్రి రోజా భావోద్వేగాం!

టాలీవుడ్ సీనియర్ నటి, జబర్దస్త్ జడ్జి రోజా ఇటీవలే మంత్రిగా బాధ్యతల్ని నిర్వహిస్తాను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారోత్సవంలోనే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, అలాగే ఇతర టీవీ షోలు సినిమాలు చేయను అని చెప్పేసింది రోజా.2013 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది రోజా.జబర్దస్త్ ఎంత మంది జడ్జీలు వచ్చి వెళ్ళినా కూడా రోజా మాత్రం తన సీట్లో ఫిక్స్ అయ్యింది.

 Minister Rk Roja Leaving The Shooting Location Of Jabardasth Varsha Gets Emotion-TeluguStop.com

నాగబాబు ప్లేస్ లో ఎంతోమంది రీప్లేస్ అయినప్పటికీ రోజా ప్లేస్ మాత్రం ఎవరు రీ ప్లేస్ చేయలేకపోయారు.

ఇప్పుడు జబర్దస్త్ నుంచి రోజా వెళ్లిపోతే నిజంగా ఆ షోకి పెద్ద లోటు అని చెప్పవచ్చు.

నాగబాబు, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, ఇంద్రజ, ఆమని, అలీ ఇలా చాలామంది జబర్దస్త్ జడ్జీలుగా మారుతూవచ్చారు కానీ.రోజా ప్లేస్‌ని రీప్లేస్ చేయలేకపోయారు.

జబర్దస్త్ షో కి దాదాపుగా నాలుగు వందల ఎపిసోడ్ లకు పైగా జడ్జిగా వ్యవహరించింది రోజా.నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సోలో జడ్జ్ గా జబర్దస్త్ మీ ముందుకు నడుపుతూ రోజా అంటే జబర్దస్త్.

జబర్దస్త్ రోజా అన్నట్టుగా తన మార్క్ ని క్రియేట్ చేసుకుంది.తాజాగా తనకు మంత్రి పదవి దక్కడంతో ఆమె జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది.

దీంతో జబర్దస్త్ కమెడియన్స్, టీం లీడర్, ఇలా జబర్దస్త్ షోలో ఉన్న ప్రతి ఒక్కరు రోజాతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్టులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ వర్ష తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.లవ్ యు అమ్మ.మీకు మంచి పదవి రావడం ఆనందంగా ఉంది.కానీ మిమ్మల్ని అవుతున్నందుకు బాధగా ఉంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.అంతేకాకుండా జబర్దస్త్ సెట్ లో చివరి రోజు రోజాని హత్తుకున్న ఎమోషన్ వీడియోని షేర్ చేసింది.

రోజా కూడా జబర్దస్త్ షోకి వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube