మీ జుట్టు తెల్లబ‌డుతోందా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది చిన్న వ‌య‌సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.

పోష‌కాల కొర‌త‌, కాలుష్యం, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, షాంపూ చేసుకునే స‌మ‌యంలో చేసే పొర‌పాట్లు వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు తెల్ల బ‌డుతూ ఉంటుంది.కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా తెల్ల జుట్టు త్వ‌ర‌గా వ‌స్తుంటుంది.

ఏదేమైన‌ప్ప‌టికీ జుట్టు తెల్ల‌బ‌డుతుంటే క‌ల‌ర్స్‌తో క‌వ‌ర్ చేసుకునే బ‌దులు.ఇప్పుడు చెప్ప‌బోయే హామ్ రెమెడీని ట్రై చేస్తే సుల‌భంగా జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే వ‌న్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతి పొడి, రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి వేసి ప‌దిహేను నిమిషాల పాటు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని చ‌ల్లార బెట్టుకోవాలి.

ఆపై ఈ హెర్బ‌ల్‌ వాట‌ర్‌ను బాటిల్‌లో నింపుకుని ఫిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.త‌ల స్నానం చేసేట‌ప్పుడు.

మీరు యూజ్ చేసే షాంపూకు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల హెర్బ‌ల్‌ వాట‌ర్‌ను మిక్స్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా త‌ల‌స్నానం చేసిన ప్ర‌తి సారి చేస్తే గ‌నుక తెల్ల జుట్టు స‌హ‌జంగానే న‌ల్ల‌గా మారుతుంది.అంతే కాదు.జుట్టు రాల‌డం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఆయిలీ హెయిర్, స్ప్లిట్ హెయిర్ వంటి స‌మ‌స్య‌ల‌ నుంచి విముక్తి ల‌భిస్తుంది.జుట్టు షైనీగా మారుతుంది.

Advertisement

మ‌రియు చుండ్రుతో తీవ్రంగా స‌త‌మ‌తం అయ్యే వారు కూడా పైన చెప్పిన విధంగా చేస్తే మంచి ఫ‌లితాలు పొందుతారు.

తాజా వార్తలు