సీటిమార్ డైరక్టర్ తో మెగాస్టార్..!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో సంపత్ నంది ఒకరు.

రాం చరణ్ తో రచ్చ చేసిన టైం లోనే స్టార్ డైరక్టర్ అవ్వాల్సినసంపత్ నంది ఎందుకో వెనకపడ్డాడు.

ఈమధ్యనే గోపీచంద్ తో సీటీమార్ అంటూ వచ్చి సత్తా చాటిన డైరక్టర్ సంపత్ నంది త్వరలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.గోపీచంద్ సీటీమార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ కు ముందు సంపత్ నంది చిరంజీవిని కలవడం జరిగింది.

ఈ మీటింగ్ లోనే ఏదైనా కథ ఉంటే చెప్పమని చిరు అన్నారట.సంపత్ నంది లైన్ చెప్పడంతో చిరు ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది.

ఫుల్ స్క్రిప్ట్ తెస్తే చూద్దామని చెప్పారట.ఆచార్య తర్వాత వరుసగా భోళా శంకర్, గాడ్ ఫాదర్, కె.ఎస్ రవీంద్ర సినిమాలను చేస్తున్న చిరంజీవి మరో యువ దర్శకుడిని లైన్ లో పెడుతున్నారని తెలుస్తుంది.సంపత్ నందికి ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే మాత్రం అతని కెరియర్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది.

Advertisement

సీటీమార్ తో మరోసారి తన మాస్ డైరక్షన్ టాలెంట్ చూపించిన సంపత్ నందితో యువ హీరోలు సినిమా చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు