టీమిండియా అవ‌న‌స‌రంగా శ్రీల‌కంకు వెళ్లిందంటున్న మాజీ క్రికెట‌ర్‌...!

భారత క్రికెట్ జట్టు ప్రథమ శ్రేణి జట్టు ఇంగ్లండ్ పర్యటనకని వెళ్తే వారిని తిరిగి శ్రీలంకకు పర్యటనకు పంపించడం అసాధ్యం కనుక బాగా ఆలోచించి బీసీసీఐ పెద్దలు ద్వితీయ శ్రేణి జట్టును శ్రీలంక పర్యటనకు పంపారు.

చాలా రోజుల క్వారంటైన్ తర్వాత బయోబబుల్ లో వన్డే సిరీస్ ఆరంభమయింది.

కాగా.ఇండియా జట్టు అలవోకగా వన్డే సిరీస్ లో మొదటి రెండు మ్యాచులను నెగ్గింది.

కానీ తర్వాత కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం టీంలో సమూల మార్పులు చేసింది.దాదాపు ఏడెనిమిది మంది ప్లేయర్లు కొత్తవారు కావడంతో వారు సరిగ్గా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

అందువల్ల చివరిదైన మూడో వన్డేలో మన భారత జట్టు ఆతిథ్య శ్రీలంక మీద చివరి వరకూ పోరాడి ఓడిపోయింది.ముందు రెండు మ్యాచులు గెలిచి ఉన్నాం కాబట్టి.

Advertisement

మూడో మ్యాచ్ ఓడిపోయినా పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.ఆ విధంగా ఇండియా జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

అనంతరం జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన మొదటి మ్యాచులోనే టీం ఇండియా అతిథ్య శ్రీలంకను మట్టి కరిపించి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది.కానీ తర్వాత టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా కరోనా భారిన పడడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన దాదపు ఎనిమిది మంది టీం సభ్యులు లేకుండానే కొత్త వారితో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది.

అనంతరం జరిగిన మూడో టీ20 లో కూడా ఓటమిని మూటగట్టుకుని సిరీస్ చేజార్చుకుంది.కాగా శ్రీలంక పర్యటనకు టీమిండియాను పంపి ప్రయోజనం ఏం లేదని మాజీ క్రికెటర్‌ యజువీంద్ర సింగ్‌ అభిప్రాయడ్డాడు.

డబ్బులకు ఇబ్బందులు పడుతున్న ఆ దేశ బోర్డును ఆదుకునేందుకే బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టుని అక్కడకు పంపిందని అన్నాడు.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు