అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్ .. ఇదిగిదిగో ఓ సర్వే

ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముందుగా అక్కడ గెలుపోటములు, పార్టీల పరిస్థితుల గురించి రకరకాల సర్వేలు.విశ్లేషణలతో రాజకీయ పార్టీలను తెగ కంగారు పెట్టిస్తుంటాయి.

అయితే ఆ సర్వేల్లో ఉన్న విశ్వసనీయత ఎంత .? ఆ సర్వేల ప్రభావం నిజంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా అంటే.అది మిలియన్ డాలర్ల ప్రశ్ననే.

కానీ కొన్ని కొన్ని సర్వేలు వాస్తవానికి బాగా దగ్గరగా ఉండడం ఆ సర్వేలపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.ఈ దశలో .త్వరలో ఎన్నికలు జరగబోయే తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు ఏంటి ఏ పార్టీ నాయకత్వాన్ని ఏ లీడర్ని ప్రజలు కోరుకుంటున్నారు అనే విషయాలను ఓ సర్వే సంస్థ బయటపెట్టింది.పనిలో పనిగా ఏపీ పార్టీ నాయకుల పైన కూడా ఆ సర్వే రిజల్ట్ బయటపెట్టింది.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజ్‌తక్‌లో ప్రసారమైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ సర్వేలో కేసీఆర్ పనితీరుపై మంచి మార్కులు పడగా .ఆ రేసులో చంద్రబాబు వెనకబడ్డారు.తెలంగాణలో సీఎం పనితీరుపై కేసీఆర్ కి మంచి మార్కులే పడ్డాయి.

Advertisement

అలాగే.ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు.

మరోవైపు ఏపీలో సీఎం పనితీరు అంశంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు.ఇక్కడ బెస్ట్ నాయకుడిగా జగన్‌కు అత్యధిక మార్కులు పడ్డాయి.

ప్రభుత్వ పనితీరులోనూ కేసీఆర్ ముందజలో ఉండగా… ఏపీలో చంద్రబాబు ఆ స్థాయిలో మద్దతు దక్కలేదు.ప్రస్తుతం ఈ సర్వే రిజల్ట్ రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.

తెలంగాణలో బెస్ట్ లీడర్ ఎవరు అనే దానికి సీఎం కేసీఆర్ అత్యధిక మార్కులు పడ్డాయి.సుమారు 43 శాతం మంది కేసీఆర్‌ను తమ లీడర్‌గా ఎన్నుకున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తర్వాత ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 18 శాతం మంది, కిషన్‌కుమార్ రెడ్డికి 15 శాతం మంది మద్దతు పలికారు.ప్రభుత్వ పనితీరులో టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు అత్యధిక మార్కులే పడ్డాయి.కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుందని 48 శాతం మంది.16 శాతం మంది పర్వాలేదు అన్నారు.ఇక 25 శాతం మంది బాగా లేదన్నారు.ఇక తెలంగాణలో రాహుల్ గాంధీ కంటే మోదీకి పాపులారిటీ ఎక్కువగా ఉంది.44 శాతం మంది మోదీకి జై కొడితే 39 శాతం మంది రాహుల్‌కి జై కొట్టారు.

Advertisement

ఇక ఏపీ నాయకుల విషయానికి వస్తే.ఇక్కడ తెలంగాణ ఫలితాలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి.ఇక్కడ సీఎం చంద్రబాబు ఇమేజ్ పాతాళానికి పడిపోయింది.

జగన్ బాగా పుంజుకున్నట్టు సర్వే లో తేలింది.మీ లీడర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది జగనే మా లీడర్ అని చెప్పారు.కేవలం 38 శాతం మాత్రమే చంద్రబాబు మా నాయకుడు అన్నారు.5 శాతం మంది పవనే మా లీడర్ అని జై కొట్టారు.ఇక చంద్రబాబు పనితీరుకు పెద్దగా మార్కులు పడలేదు.33 శాతం మంది బాగుంది అంటే…18 శాతం మంది పర్వాలేదు అని.38 శాతం మంది బాగాలేదని చెప్పారు.అయితే ఇక్కడ మోదీ కంటే రాహుల్‌కి గ్రాఫ్ పెరిగింది.

ఇందులో మోదీకి ౩౮ శాతం మంది రాహుల్‌కి 44 శాతం మంది మద్దతు పలికినట్టు ఆ సర్వే తేల్చింది.

తాజా వార్తలు