New York : డాలర్ డ్రీమ్స్ : దొడ్డిదారిన అమెరికాలోకి .. న్యూయార్క్‌లో ముగ్గురు భారతీయులు అరెస్ట్

అక్రమ మార్గాల్లో అమెరికా( America )లో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.

అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.కొద్దినెలల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.

ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

3 Indian Nationals Arrested While Entering Us Illegally From Canada
Advertisement
3 Indian Nationals Arrested While Entering Us Illegally From Canada-New York :

తాజాగా అమెరికాలోకి దొడ్డిదారిన ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు భారతీయులతో సహా నలుగురిని న్యూయార్క్( New York ) రాష్ట్ర పరిధిలోని కెనడా సరిహద్దు వెంబడి అరెస్ట్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.బఫెలో నగరంలోని ఇంటర్నేషనల్ రైల్ రోడ్ బ్రిడ్జిపై కదులుతున్న ఫ్రైట్ రైలు నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా యూఎస్ పెట్రోలింగ్ విభాగం మహిళ సహా నలుగురిని అదుపులోకి తీసుకుంది.అరెస్ట్ అయిన నాల్గవ వ్యక్తిని డొమినికన్ రిపబ్లికన్ నుంచి గుర్తించారు.

3 Indian Nationals Arrested While Entering Us Illegally From Canada

గాయం కారణంగా కదల్లేని స్థితిలో వున్న మహిళను .పోలీసులను చూసి తోటి పురుషులు వదిలిపెట్టేశారు.గాయపడిన మహిళ ఎరీ కౌంటీ షెరీఫ్ డిప్యూటీలు, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ (సీబీపీ)( U S Customs and Border Protections ) వద్ద ప్రథమ చికిత్స పొందింది.

చికిత్స అనంతరం బాధిత మహిళను అంబులెన్స్‌లో స్థానిక వైద్య కేంద్రానికి తరలించారు.ఆ నలుగురు వ్యక్తులు పత్రాలు లేని పౌరులేనని దర్యాప్తులో తేలింది.దీంతో వారిపై ఇమ్మిగ్రేషన్ , జాతీయత చట్టంలోని 212, 237 సెక్షన్ల కింద అియోగాలు నమోదు చేశారు.

దేశ బహిష్కరణ విచారణ కోసం బటావియా ఫెడరల్ డిటెన్షన్ ఫెసిలిటీలో వీరిని నిర్బంధించినట్లు మీడియా నివేదిక పేర్కొంది.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు