103 ఏళ్ల వృద్ధురాలు... కరోనాను జయించి మందు కొట్టింది!

దాదాపుగా సంవత్సరం నుంచి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రమవుతుంది.ఈ కరోనా వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు.

అయితే వీరిలో అధిక శాతం వయసుమళ్ళిన వారు ఉండటం విశేషం.60 సంవత్సరాలు పైబడి వయస్సు ఉన్న వారిలో సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.అలాంటి వారిలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింతే బ్రతకడం కష్టమని భావించిన అధికారులు వయసు మళ్ళిన వారిని వీలైనంత వరకు ఇంట్లో ఉండమని సూచించింది.కానీ కొందరు వృద్ధులలో మాత్రం వంద సంవత్సరాలు దాటిన వారు కూడా కరోనాను జయించి బతికిబట్ట కడుతున్నారు.103 సంవత్సరాల వయసు కలిగిన జెన్నీ స్టెంజా అనే వృద్ధురాలు కరోనా లక్షణాలతో బాధపడుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయించగా ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది.వయసు ఎక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆ వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు.

సాధారణంగా వయసు మళ్ళిన వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.అలాంటప్పుడు కరోనా వైరస్ వంటి మహమ్మారి బారిన పడితే బ్రతకడం చాలా కష్టమని అందరికీ తెలిసిన విషయమే.

103 Years Old Woman Recovered From The Corona And Drink Drug 103 Years Old, Rec

జెన్నీ స్టెంజాకు సరైన సమయంలో మంచి వైద్యం అందడంతో ఈ వృద్ధురాలు ఆ మహమ్మారి నుంచి బయటపడింది.వారం రోజుల తర్వాత తిరిగి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందులో ఆమెకు నెగెటివ్ అని నిర్ధారణ అయింది.

ఈ వృద్ధురాలికి కరోనా నెగిటివ్ రావడంతో ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం పెరిగి, కరోనా సోకితే భయపడాల్సిన పనిలేదు, ధైర్యంగా ఉంటే కరోనాను కూడా జయించవచ్చు, అనే భరోసా అందరిలో కలిగింది.ఇన్ని రోజులు వయస్సు మళ్ళిన వారిలో కరోనా వస్తే వ్యాధి తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు అన్న విషయం కేవలం అపోహ మాత్రమే.

Advertisement

మన శరీరంలో వ్యాధితో పోరాడే రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల ఎటువంటి వ్యాధులనైనా జయించవచ్చు అని ఈ వృద్ధురాలు మరోసారి రుజువు చేసింది.ఈ వృద్ధురాలికి కరోనా నెగిటివ్ రావడంతో ఆనందంతో ఆస్పత్రి బెడ్ పైనే కూల్ బీర్ బాటిల్ ఓపెన్ చేసి తాగింది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు కరోనా నుంచి విముక్తి పొందినందుకు సెలబ్రేషన్ అని కామెంట్ చేయగా, మరికొందరు ఇప్పటికే కరోనా బారిన పడ్డ వృద్ధురాలు తిరిగి ఇలా మందు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరమని సదరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు