రేషన్ షాపుల ద్వారా మినీ సిలిండర్ల విక్రయాలు.

సూర్యాపేట జిల్లా: జిల్లాలో మినీ సిలిండర్లను రేషన్ షాపుల ద్వారా విక్రయాలు జరిపేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు తెలిపారు.

గురువారం జిల్లాలోని రేషన్ డీలర్స్ తో మినీ సిలిండర్ విక్రయాలపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేషన్ షాపులలో మినీ సిలిండర్ విక్రయాలకు సంబంధిత డీలర్ల నుండి ఎలాంటి అనుమతులు అవసరం లేదని,కమర్షియల్ పర్పస్ లో విక్రయలు పెంచుకుంటే ఆయిల్ కార్పొరేషన్ డీలర్స్ తో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

వ్యాపారుల వాణిజ్య అవసరాలకు మినీ సిలిండర్లు ఎంతో ఉపయోగ పడతాయన్నారు.రేషన్ షాపుల ద్వారా విక్రయించే డీలర్లకు సిలిండర్ ఒక్కంటికి రూ.41 కమిషన్ చెల్లించడం జరుగుతుందని,డిపాజిట్ రూపంలో రూ.940 చెల్లిస్తే రూ.620 లకే మినీ సిలెండర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.రేషన్ షాపులలో విక్రయాలను బట్టి 20 సిలిండర్లు నిల్వ చేసుకోవచ్చని అన్నారు.

జిల్లాలోని మున్సిపాలిటీలు,పెద్ద గ్రామాలలో 5 కిలోల మినీ సిలెండర్లు ఎక్కువగా విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహించామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న వ్యాపారుల వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

Advertisement

సంబంధిత ఆయిల్ కంపినీ డీలర్స్ రేషన్ షాపులకు సరఫరా చేస్తారని,రేషన్ డీలర్లకు ఆదాయం కల్పించుటలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని,అలాగే బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా కట్టడి చేయవచ్చని అన్నారు.అనంతరం ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ద్వారా రేషన్ డీలర్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఆయిల్ కంపినీ డీలర్స్ మినీ సిలిండర్ వినియోగంపై రేషన్ డీలర్లకు బ్యాంకు అధికారులు,ఎల్.

పి.జి.,ఐ.ఓ.సి.ఎల్ అధికారులు ఈ సందర్బంగా అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో ఎల్.డి.ఎం.జగదీష్ చంద్రబోస్, డి.ఎస్.ఓ విజయలక్ష్మి,డి.ఎం.రాంపతి,ఏ.ఎస్.ఓ పుల్లయ్య,డి.టి.రాజశేఖర్,రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News