మహిళల స్వతంత్ర ప్రధాత అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలి

యాదాద్రి జిల్లా:హక్కులకు దూరమై,ఆభద్రత, అజ్ఞానంలో ఉన్న మహిళల విముక్తి కోసం కృషి చేసిన అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని ముల్కలపల్లి మండల ప్రాదేశిక సభ్యురాలు ధీరావత్ ప్రతిభ రాజేష్ నాయక్ అన్నారు.

మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల (67) సమర్పించిన అనంతరం ఆమె మాట్లడారు.

మహిళల సమస్యలను సామాజిక ఉద్యమాలలో భాగస్వామ్యం చేసిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ అని ఆమె అన్నారు.మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం,వేతనం,ఓటు హక్కు,ఆస్తి హక్కులు కల్పించిన అంబేడ్కర్ ను మహిళలు మరవరాదని ఆమె అన్నారు.

భారత రాజ్యాంగంలో ఆర్టకల్ 14,16 లలో స్త్రీలకు పురుషులతో సమానంగా సాంఘిక, ఆర్థిక,సామాజిక న్యాయాన్ని,భావస్వేచ్చసమానత్వం ,సమాన అవకాశాలు కల్పించడం వలన నేను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడ్డానని ఆమె తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ది ఉంటే,వెంటనే డాక్టర్ అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి.(CAPSS) జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్.

Advertisement

జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య,సాధన సమితి జిల్లా నాయకులు బానోతు భాస్కర్ నాయక్,బర్రె సుదర్శన్, మహ్మద్ సలావుద్ధీన్,సాల్వేరు ఉపేందర్, సిలివేరు రమేష్,LHPS జిల్లా అద్యక్షులు భానోతు రాజేష్ నాయక్,నర్సింహ నాయక్,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ
Advertisement

తాజా వార్తలు