పెళ్ళైన 8 రోజులకే ఇంట్లో విషాదం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.పెళ్ళైన వారం రోజులకే నవ వరుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శోభనాద్రిగూడెంకు చెందిన పరికల శ్రీకాంత్ (23)అనే యువకుడికి తన సొంత మేనమామ కూతురితో ఫిబ్రవరి 20 న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.ఏమైనదో ఏమో కానీ,శ్రీకాంత్ సోమవారం ఇంటి నుండి బైక్ పై బయటకు వెళ్లి,తిరిగి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలీ తుదిశ్వాస విడిచాడు.

కండ్ల ముందే కన్న కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు,ఇంకా కాళ్ల పారాణి ఆరక ముందే తన భర్త తనువు చాలించడంతో నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయి బోరున విలపిస్తున్నారు.

మహిళ సమాఖ్యలో భారీ కుంభకోణం.. 28 లక్షలు స్వాహా
Advertisement

Latest Suryapet News