కొద్దీ నెలలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా స్పీడ్ పెంచింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ని పరుగులు పెట్టించాలని చూస్తోంది.
ఏపీలో అధికారం దక్కడం సాధ్యం కాదని తెలుసు అందుకే తెలంగాణాలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది.గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే కాంగ్రెస్లో టీఆర్ఎస్ను విలీనం చేస్తానని మాటిచ్చిన కేసీఆర్.
విలీనం కాదు కదా.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఆ పార్టీలోని కీలక నేతలను గులాబీ గూటికి చేర్చుకున్నాడు.దీంతో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడింది.

ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో బాగా బలపడినట్లు కనిపిస్తోంది.అంతేకాదు, ఇప్పుడు ఆ పార్టీ నేతలు బాగా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి ఆ పార్టీ.టీడీపీలో కేసీఆర్ వ్యతిరేకులైన రేవంత్ రెడ్డి వర్గంలోని కొందరు ముఖ్య నేతలను వారి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయన వచ్చిన తర్వాత టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేయడంలో సక్సెస్ అయ్యింది.
ఇక ఏపీలో సాగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ తన భుజాలకు ఎత్తుకుంది.తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే జాతీయ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినప్పటి నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు దీనిని సమర్ధిస్తున్నారు.
ఏపీలో విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణలో ఇలా చేయడం వల్ల టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ వలే కాంగ్రెస్ కూడా సెటిలర్ల పార్టీ అనే ముద్ర వేస్తున్నారు.ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది.

అందుకే దీనిపై రాష్ట్రంలో సర్వే నిర్వహించబోతుందట.కాంగ్రెస్ పార్టీని సెటిలర్ల పార్టీ అని మీరు భావిస్తున్నారా.? ఏపీకి హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడాన్ని మీరు సమర్ధిస్తారా.?, వచ్చే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు.?’’ వంటి ప్రశ్నలను మరికొన్ని తాయారు చేసి తెలంగాణాలో సర్వే చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.ఆ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చెయ్యాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉంది.