చిన్నజీయర్ స్వామిపై ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలి:-గిరిజన సంఘాలు డిమాండ్

వన దేవతలు సమ్మక్క,సారలమ్మపై చిన్నజీయర్ స్వామి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గిరిజన సంఘం,గిరిజన సమైక్య,లంబాడీ హక్కుల పోరాట సమితి,సేవాలల్ సేన ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలు కురిపిస్తూ, కోటాను కోట్ల మంది భక్తులు వచ్చి ఆసియా ఖండం లోనే అతి పెద్ద గిరిజన కుంభ మేళాగా పేరుగాంచిన గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మలని, కులం మతం తారతమ్యం లేకుండా భక్తులంతా కొలిచే అమ్మవార్లు సమ్మక్క,సారలమ్మలని, అటువంటి వారిపై, చిన్న జీయర్ స్వామి అసలు వీళ్ళు దేవతలే కారని ? ఏమైనా వీరు బ్రహ్మలోకం నుండి దిగి వచ్చార ? అని ఏదో అడివి దేవతలు వ్యాపారం కోసం ఇదంతా చేస్తున్నారని చినజీయర్ స్వామి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బ్రాహ్మణ భావజాలంతో , ఆధిపత్య పెత్తందారి మనస్తత్వంతో ప్రకటన చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

హైదరాబాద్ మహానగరంలో సమతా మూర్తి విగ్రహం 120 కిలోల బంగారం తో చేసి చూడడానికి వచ్చే ప్రతి మనిషి వద్ద నూట యాభై రూపాయల టికెట్ ఇచ్చి భగవంతుని వ్యాపారం చేస్తున్నది చినజీయర్ స్వామి అని ఆరోపించారు.

గిరిజన ప్రజల మనోభావాలను ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ , ఎస్టీ , అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఖమ్మం నగరంలోని వన్ టౌన్ , టూ టౌన్ , ఖానాపురం హవేలి , అర్బన్ పోలీస్ స్టేషన్లలో సంబంధించిన పోలీస్ అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు .ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య కృష్ణనాయక్ , గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి బోడ వీరన్న నాయక్ , జిల్లా అధ్యక్షులు బానోతు భరత్ నాయక్ , లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రంజిత్ నాయక్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ , సేవాలాల్ సేన జిల్లా నాయకుడు బానోతు ఉపేందర్ నాయక్ , భుఖ్య బాలాజీ నాయక్ , సేవాలాల్ మహిళ జిల్లా అధ్యక్షురాలు ప్రమీలా భాయ్ , సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ , సుశీల బాయ్ , అనితా బాయ్ , పద్మా బాయి తదితరులు పాల్గొన్నారు .

ప్రభాస్ స్టామినాతో పోటీ పడే హీరో ఎవరు.. ఈ హీరోలలో ఎవరు సత్తా చాటుతారంటూ?

Latest Khammam News