కరాటే ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది

సూర్యాపేట జిల్లా: బాల బాలికలకు ఆత్మరక్షణతో పాటు,వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కరాటే తోడ్పడుతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యయాదవ్ అన్నారు.

ఇటీవల ఖమ్మం పట్టణంలో నిర్వహించిన కేసరి చందర్ మెమోరియల్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే డు అకాడమీ సీనియర్ కరాటే మాస్టర్ జే.

వీ.రమణ ఆధ్వర్యంలో గెలుపొందిన 35 మంది విద్యార్థులకు ఆదివారం స్థానిక సంగీత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్లు,మెడల్స్ ప్రదానం చేసి,పేట కరాటే విద్యార్థులు బహుమతులు సాధించడం అభినందనీయమని,కరాటే విజేతలను అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడంతో విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందన్నారు.

సూర్యోదయం కంటే ముందు నిద్రలేవడం మంచి లక్షణమని,ఆ లక్షణం కరాటే ద్వారా అలవడుతుందన్నారు.ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచి కరాటే శిక్షణ తీసుకొని,వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించడం అభినందనీయమన్నారు.

కరాటే మాస్టర్ జీవీ రమణ మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో నిర్వహించిన పోటీల్లో తమ విద్యార్థులు 10 ప్రథమ,15 ద్వితీయ, 5 తృతీయ బహుమతులను సాధించటం జరిగిందన్నారు.ఈ సందర్బంగా బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్,డీజే సౌండ్స్ జిల్లా అధ్యక్షులు చీకూరి అశోక్, కరాటే మాస్టర్లు ఆర్ సంతోష్,పవన్ కల్యాణ్, సాయికిరణ్,నిఖిల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024
Advertisement

తాజా వార్తలు