Director YVS Chowdary attempts suicide

ఒకప్పుడు టాప్ హీరోలతో పనిచేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరి.నాగార్జున - హరికృష్ణలతో తీసిన మల్టిస్టారర్ సీతారామరాజు మంచి సక్సెస్ ని సాధించింది.

దాంతో అప్పుడే లాంచ్ అయిన మహేష్ బాబుని కూడా డైరెక్ట్ చేసాడు వైవిఎస్.ఆ సినిమా యావరేజ్ గా నిలిచినా, మళ్ళీ లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి వరుస హిట్లతో కంబ్యాక్ చేసాడు ఈ దర్శకుడు.

ఆ తరువాత రామ్, ఇలియానాలను లాంచ్ చేస్తూ తెరకెక్కించిన దేవదాసు ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో మీ అందరికి గుర్తే ఉంటుంది.కాని చౌదరీ బ్యాడ్ టైం ఆ సినిమా తరువాతే స్టార్ట్ అయ్యింది.

ఒక్కమగాడు, సలీమ్, సాయి ధరమ్ తేజ్ ని పరిచయం చేస్తూ తీసిన రేయ్ .మూడు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.తన సినిమాలకి డబ్బు కూడా పెట్టె అలవాటు ఉన్న చౌదరీ నష్టాల్లోకి పడిపోయారు.

Advertisement

అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తానూ నిర్మించిన నిప్పు సినిమా కూడా భారి డిజాస్టర్ అవడంతో తెలుకోలేకపోయారు వైవిఎస్.ఈ ఆర్ధిక ఇబ్బందుల వలనే ఏమో .ఆయన సూసైడ్ కి యత్నం చేసారని తెలుస్తోంది.ప్రస్తుతానికైతే ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఈ వార్త నిజామా కాదా అనే విషయం పూర్తిగా తెలియదు.

చౌదరీ ఆత్మహత్యాయత్నం ఎలా చేసారు, ఎక్కడ చేసారు, ఇప్పుడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు .ఈ వివరాలేవీ తెలియరాలేదు.అసలు సూసైడ్ ప్రయత్నం నిజంగానే జరిగిందా అనే విషయం మీద క్లారిటి కూడా లేదు.52 ఏళ్ల వైవిఎస్ చౌదరీ నందమూరి ఫ్యామిలికి వీరాభిమాని.1998 లో శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైవిఎస్ కేవలం దర్శకుడిగా కాకుండా, నిర్మాతగా, పంపిణిదారుడిగా, ఎగ్జిబీటర్ గా పనిచేసారు.

Advertisement

తాజా వార్తలు