తిరుపతిలో గెలిచేదెవరు ఓడేది ఎవరు అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతుండగా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ పట్టుకుంది.అన్ని పార్టీలకు ఇవి ప్రతిష్టాత్మకంగా కావడంతో, తిరుపతిని తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలని అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
సహజంగా అధికార పార్టీ వైసీపీ ఇక్కడ తామే గెలవబోతున్నాము అనే టెన్షన్ లో ఉండగా, బిజెపి, జనసేన కూటమి మాత్రం ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ తమకే అవకాశం ఉందని, తిరుపతిలో బిజెపికి పట్టు ఉందని, అలాగే పవన్ చరిస్మా సైతం తమకు బాగా ఉపయోగపడుతుందని బిజెపి నమ్మకం పెట్టుకుంది.జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గట్టిగానే కష్టపడుతూ, తిరుపతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక టిడిపి తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బలహీనంగా ఉన్నా, గట్టిగానే పోటీ ఇవ్వాలని చూస్తోంది.
తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా, కొన్ని చోట్ల మాత్రం వైసిపి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం కాస్త టెన్షన్ పెడుతోంది.
మెజారిటీ ఆశించినంత స్థాయిలో రాకపోతే, వైసీపీ బాగా బలహీన అయ్యింది అనే సంకేతాలు జనాల్లోకి వెళతాయి అనే టెన్షన్ పడుతోంది.అందుకే జగన్ ఈ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి ఎమ్మెల్యే కు మెజార్టీ పై టార్గెట్ విధించారు.దీంతో ఎమ్మెల్యేల్లో ఎక్కడలేని టెన్షన్ కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో వైసీపీకి ఇక్కడ రెండు లక్షలకు పైగా మెజార్టీ రాగా, ఇప్పుడు నాలుగు లక్షలకు తగ్గకుండా చూడాలి అని జగన్ టార్గెట్ విధించడంతో ఎమ్మెల్యేలు ఇది సాధించే పనిలో బిజీగా ఉన్నారు.అయితే తిరుపతి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పరిస్థితి ఆశించినంత స్థాయిలో లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది.ప్రస్తుతం జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుండడం తో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా లో వైసిపి ఉంది అదీ కాకుండా , పూర్తిగా వైసీపీని ఆదరించే స్థాయిలో ఈ నియోజకవర్గాల్లో పరిస్థితులు లేకపోవడం, తిరుపతి ఆధ్యాత్మిక నగరం కావడంతో బిజెపి హిందూత్వ సెంటిమెంటును ఉపయోగించి గట్టెక్కాలని చూస్తున్నాయి.దీంతో జగన్ విధించిన టార్జెట్ చేరుకోగలమా అనే టెన్షన్ వైసిపి తిరుపతి లోక్ సభ నియోజక వర్గ పరిధిలో ని ఎమ్మెల్యే ల్లో నెలకొంది.