తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.కేంద్రం మొండివైఖరి విడనాడాలి.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులను క్షోభకు గురిచేయవద్దు.రైతుల ఆగ్రహ జ్వాలలు వ్యక్త పరచడాన్ని కేంద్రం తక్కువ అంచనా వేయడం తగదు .మా మాటనే నెగ్గాలి అనే కేంద్రం ధోరణి కూడదు.కేంద్రం ప్రజల కదలిక రైతాంగం యొక్క అభీష్టాన్ని అంచనా వేసి తెలంగాణ ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలి.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణకు చేయూతనివ్వాల్సింది పోయి అడుగడుగునా ఆటంకాలు కలిపిస్తున్న కేంద్రం వైఖరి అత్యంత దుర్మార్గంగా ఉన్నది.
రేపు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టబోయే దీక్ష అత్యంత చారిత్రాత్మకం అవుతుంది.
ఇంత పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రం తరలివచ్చి దీక్షకు పూనుకోవడం మామూలు విషయం కాదు .ఇంతవరకు కేంద్రం పరిస్థితిని తీసుకు రావాల్సింది కాదు.
2001 – 2002 అటల్ బిహారి వాజ్ పాయి హయాంలో రంగు మారిన ధాన్యం కొనుగోలుకు ఎఫ్ సీ ఐ నిరాకరిస్తే, అప్పటి ఆహార పౌరసరఫరాల మంత్రి నిరాకరిస్తే రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం ఆందోళన చేపడితే కేంద్రం ముందుకువచ్చి కొనుగోళ్లు చేపట్టింది.ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమాలకు అనుకూలంగా బీజేపీ మిత్రపక్షం అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కేంద్రం కనువిప్పు కోసం లేఖలు రాశారు.
రైతాంగం పట్ల కేంద్రం కఠినంగా ఉండడం ఏమాత్రం సరయింది కాదు.తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యం ఎలాంటి షరతులు లేకుండా సేకరించాలని భారత ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం.
రేపు ఢిల్లీ తెలంగాణ భవన్ లో జరిగే నిరసన దీక్షకు విచ్చేసిన సంధర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.







