ఇరుకునపెట్టే ప్రసంగాలతో కేసీఆర్ పై షర్మిల ఫైర్ ?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా మారేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్ షర్మిల ఇంకా పార్టీ పెట్టకుండానే టిఆర్ఎస్ ను పూర్తిస్థాయిలో టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ, తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుతుండడం తో ఇప్పటి నుంచే అన్ని రకాలుగానూ ప్రజలలో బలం పెంచుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టబోయే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీని పూర్తిగా టార్గెట్ చేసుకుని ప్రభుత్వ అసమర్థతను, లోపాలను హైలైట్ చేసి ప్రజల్లో సానుకూలత సంపాదించాలనే అభిప్రాయంతో షర్మిల ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.దానిలో భాగంగానే తెలంగాణలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను ఆమె హైలెట్ చేసుకుంటున్నారు.

గతంలోనే దీనిపై దీక్షకు దిగిన షర్మిల ఆ తరువాత కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడతో సైలెంట్ అయిపోయారు.ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ నిరుద్యోగ సమస్య పైనే వాయిస్ పెంచుతున్నారు.

కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తూ కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ లో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ,  మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలం సేరిల్ల వెంకటేష్ అనే యువకుడు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడడంతో, అతడి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

Advertisement

మీడియో తో మాట్లాడిన కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు.ప్రత్యేక తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అందరూ నమ్మరు.

కానీ తెలంగాణ వచ్చి ఇన్ని ఏళ్లు అవుతున్నా, అవేమి అమలు కావడం లేదని, ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ షర్మిల కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం తో ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అని, ఇది తెలంగాణ ఉద్యమానికి అవమానం అంటూ ఆమె మాట్లాడారు.

రసూల్ ఇంకెంత మంది నిరుద్యోగులు చనిపోతే కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు అని, మరి ప్రజల పిల్లలకు ఉద్యోగాలు వద్దా అంటూ ఆమె ఫైర్ అయ్యారు.కేవలం నిరుద్యోగ సమస్యలతో పాటు, టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహానికి కారణం అయిన అన్ని అంశాల పైన పోరాటం చేసేందుకు షర్మిల కసరత్తు చేస్తున్నారు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు