బీజేపీ కార్యకర్త సాయిగణేష్ తో నిశ్చితార్థం అయిన యువతి ఆత్మహత్యయత్నం!

ఖమ్మం నగరానికి చెందిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ బలవన్మరణం పొందిన విషయం తెలిసిందే.హ ఉదంతం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

మే 4 న సాయి గణేష్ వివాహం జరగాల్సి ఉండగా, పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ సాయి గణేష్ బలవన్మరణం పొందిన విషయం తెలిసిందే.అది అలా ఉంటే సాయి గణేష్ తో నిశ్చితార్థమైన యువతి, కొద్దిసేపటి క్రితం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

సాయి గణేష్ మరణించిన రోజు నుంచి మనోవేదన తో ఉన్న యువతి, ఈరోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం కి పాల్పడటం తో స్థానికులు గమనించి యువతి పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.చికిత్స కొనసాగుతుంది.

విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.పూర్తి వివరాలు తెలియసి ఉంది.

Advertisement
Hell Spin CA Review And Player Reputation : Platform Mechanics And Banking

Latest Khammam News