కొరటాల శివకు అలాంటి కండీషన్ పెట్టిన తారక్.. వేలు పెట్టకూడదంటూ?

యంగ్ టైగర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తెరకెక్కగా ఈ సినిమా అప్పటివరకు ఎన్టీఆర్ సాధించిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించింది.

సినిమాలో కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా తన అభినయంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.

అయితే కొరటాల శివకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ షాకింగ్ షరతును విధించారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.తన సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ కొరటాల శివ తల దూర్చకూడదని ఎన్టీఆర్ చెప్పారని ఈ షరతుకు కొరటాల శివ సైతం అంగీకరించారని తెలుస్తోంది.

ఆచార్య సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు తన సినిమా విషయంలో జరగకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆచార్య సినిమాకు సంబంధించి అన్ని విషయాల్లో కొరటాల శివ జోక్యం చేసుకున్నారు.

ఫలితంగా ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోగా కొరటాల శివ చివరకు తన రెమ్యునరేషన్ ను సైతం త్యాగం చేయాల్సి వచ్చింది.ఆచార్య సినిమా పెట్టుబడి, రాబడితో పోల్చి చూస్తే ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల మేర నష్టాలు మిగిలాయని తెలుస్తోంది.

Advertisement

ఆచార్య సినిమా విషయంలో మెగా మ్యాజిక్ వర్కౌట్ కాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆచార్య సినిమా డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

కొరటాల శివ ఎంతో కష్టపడినా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో విఫలమయ్యారు.కొరటాల శివ సైతం గత సినిమాల అనుభవాల నేపథ్యంలో ప్రొడక్షన్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ మూవీకి ఇద్దరు నిర్మాతలు అనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు