నితిన్ రాబిన్ హుడ్ మూవీ సెన్సార్ రివ్యూ.. ఈ హీరో బ్లాక్ బస్టర్ సాధించినట్టేనా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన నితిన్(nithin ) కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.నితిన్ కు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు.

భీష్మ, రంగ్ దే(Bhishma, Rang De) సినిమాలతో సక్సెస్ సాధించిన నితిన్ తర్వాత రోజుల్లో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే.అయితే రాబిన్ హుడ్(robinhood) సినిమాతో నితిన్ కచ్చితంగా భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరో 3 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా 2 గంటల 36 నిమిషాల నిడివితో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ప్రమోషన్స్ సైతం వినూత్నంగా జరుగుతుండగా నితిన్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే ఈ సినిమాకు సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గా ఉండటం గమనార్హం.

Young Hero Nithin Robinhood Movie Censor Review Details Inside Goes Viral In Soc
Advertisement
Young Hero Nithin Robinhood Movie Censor Review Details Inside Goes Viral In Soc

ఫస్టాఫ్ లో కామెడీ, హై వోల్టేజ్ సీన్స్ ఉంటాయని సెకండాఫ్ లో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.ఛలో, భీష్మ సినిమాలను పూర్తిస్థాయిలో క్లాస్ గా తెరకెక్కించిన వెంకీ కుడుముల ఈ సినిమాను మాస్ అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.అది దా సర్ప్రైజ్ సాంగ్ సినిమాకు హైలెట్ ఉంటుందని వన్ మోర్ టైమ్ సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సాధిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు రాబిన్ హుడ్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.మైత్రీ నిర్మాతలు రాబిన్ హుడ్ సినిమా కోసం నితిన్, శ్రీలీల మార్కెట్ ను మించి ఖర్చు చేశారు.

మరి నిర్మాతలకు ఈ సినిమా అదే స్థాయిలో లాభాలను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

నా తల్లీదండ్రుల పెళ్లికి మతం అడ్డు రాలేదు.. సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు