వాట్సాప్ కాల్స్‌లో నచ్చిన రింగ్టోన్స్ సెట్ చేసుకోవచ్చు.. అది ఎలా అంటే..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇన్‌కమింగ్ కాల్స్‌, మెసేజ్‌ల కోసం నచ్చిన రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ కాంటాక్టుల కోసం కావాల్సినట్టుగా కస్టమ్ అలర్ట్స్‌ సెట్ చేసుకోవచ్చు.

ఒక్కో కాంటాక్టుకు ఒక్కో కస్టమ్ అలర్ట్, రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవచ్చు.అదెలాగో చూద్దాం.

ఆండ్రాయిడ్ వాట్సాప్ యాప్‌లో కస్టమ్ రింగ్‌టోన్‌లను సెట్ చేసుకోవడానికి యూజర్లు మొదటగా తమ ఫోన్‌లో వాట్సాప్ యాప్ లాంచ్ చేసి చాట్స్ ట్యాబ్‌కు వెళ్లి కస్టమ్ రింగ్‌టోన్‌ని సెట్ చేయాలనుకుంటున్న కాంటాక్టును సెలెక్ట్ చేసుకోవాలి.ఆపై ఆ కాంటాక్ట్ ప్రొఫైల్‌ ఓపెన్ చేసి కింద కనిపిస్తున్న కస్టమ్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయాలి.తరువాత ‘యూజ్‌ కస్టమ్ నోటిఫికెషన్స్’ ఆప్షన్‌లో కాల్ నోటిఫికేషన్స్‌ కింద రింగ్‌టోన్‌పై క్లిక్ చేసి ఇష్టమైన రింగ్‌టోన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇక ఆండ్రాయిడ్ వాట్సాప్ యాప్‌లో కస్టమ్ నోటిఫికేషన్ టోన్‌ని సెట్ చేయడానికి.యూజర్లు మొదటగా తమ ఫోన్‌లో వాట్సాప్ లాంచ్ చేసి చాట్స్ ట్యాబ్‌కు వెళ్లాలి.కస్టమ్ రింగ్‌టోన్‌ని సెట్ చేయాలనుకుంటున్న కాంటాక్టును సెలెక్ట్ చేసుకుని నచ్చిన టోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Advertisement

ఇష్టమైన కస్టమ్ రింగ్టోన్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక ఐఫోన్లలో గ్రూప్ కాల్స్‌కి డిఫాల్ట్ రింగ్‌టోన్‌ని మాత్రమే వాడటం కుదురుతుంది.ఈ రింగ్‌టోన్‌ని మార్చడం చేయడం కుదరదు.

ఇకపోతే వాట్సాప్ ఈ ఏడాదిలో వీడియో కాల్‌ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్, వ్యూ వన్స్ టెక్స్ట్, కంపానియన్ మోడ్, స్టేటస్‌లో వాయిస్ నోట్స్ పరిచయం చేయడానికి సిద్ధమైంది.

Advertisement

తాజా వార్తలు