ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకుంటే ఫ్లైట్ లో వెళ్ళచ్చు

మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చెన్నై లేదా బెంగళూరుకు రైల్లో టికెట్ బుక్ చేసుకుని, వెయిటింగ్ లిస్టు జాబితాలో ఉన్నారా? మీ సెల్ ఫోన్ కూడా చూసుకుంటూ ఉండండి.

మీకు ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ ను కేటాయిస్తున్నట్టు రైల్వే శాఖ నుంచి మెసేజ్ రావచ్చు.

మీరు ఆ రైలు కన్నా ఎన్నో గంటల ముందుగా గమ్యస్థానానికి చేరవచ్చు.ఈ మేరకు ఐఆర్సీటీసీ, ఎయిర్ ఇండియా మధ్య అవగాహన కుదరగా, రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్ ఉన్న వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే, విమాన టికెట్ లభిస్తుంది.ఇక తరువాతి తరగతుల్లో టికెట్లున్నవారు రూ.2 వేలు చెల్లించాల్సి వుంటుంది.రైలు వెళ్లే రూట్లో ఉన్న విమానాశ్రయాలకు ఎయిర్ ఇండియా నడుపుతున్న సర్వీసులు, వాటిల్లో ఖాళీలను బట్టి ఎంతమంది వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు చోటు లభిస్తుందన్నది ఎప్పటికప్పుడు మారుతుంటుంది.

గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు
Advertisement

తాజా వార్తలు