కూతురు పుట్టిందని తన భార్యతో గొడవపడి అమెరికాకు చెక్కేసాడో ప్రబుద్ధుడు.అమెరికాకు వెళ్లి నాలుగేళ్లయినా ఇప్పటివరకు తిరిగి రాలేదు.
భర్త వెంకట నారాయణరెడ్డి తనను, తన కూతురిని వదిలేసి అమెరికా వెళ్లిపోవడంతో అత్తింట్లో ఉంటోన్న అర్చన అనే మహిళ ఎన్నో కష్టాలను ఎదుర్కుంటోంది.అత్తింట్లో తనను, తన కూతురును తీవ్ర వేధింపులకు గురి చేస్తుండడంతో అర్చన తాజాగా అధికారులను ఆశ్రయించింది.
అత్తా, మామలు తన కూతురిని, తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెప్పింది.తన మరిది ఎం.రాఘవేందర్‌రెడ్డి తన కూతురిని బెల్టుతో కొడుతున్నాడని, చంపేస్తానని కూడా బెదిరించాడని తన కూతురిని కాపాడాలంటూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను కోరింది.అమెరికాకు చెక్కేసిన వెంకట నారాయణరెడ్డిది స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కానాపూర్.
కాగా, అర్చన తన కూతురిని కాపాడాలంటూ హైదరాబాద్ లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులను కోరింది.







