రైటర్ అబ్బూరి రవి కి త్రివిక్రమ్ కి మధ్య సంభందం ఏంటి...

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన పేరు కి ఒక బ్రాండ్ ఉంది ఆయనతో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో సిద్ధం గా ఉంటాడు.

అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట్లో చాలా కష్టాలు పడి తిని తినక బాధపడిన రోజుల నుంచి ఈ స్థాయి కి ఎదగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

త్రివిక్రమ్ లానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరో మంచి రైటర్ ఉన్నాడు అతనే అబ్బూరి రవి ఈయన బొమ్మరిల్లు, పంజా, మిస్టర్ పర్ఫెక్ట్,కిక్ లాంటి చాలా హిట్ సినిమాలకి రైటర్ గా చేసాడు ఈయన రాసిన మాటల్లో పదును ఉంటుంది,వినడానికి చాలా కొత్త గా ఉంటూనే మనల్ని ఆలోచించేలా చేస్తాయి.

అయితే త్రివిక్రమ్,అబ్బూరి రవి ఇద్దరు కూడా స్కూల్ లో మంచి ఫ్రెండ్స్ ఇద్దరు క్లాస్మేట్స్ అలాగే ఒకే బెంచ్మేట్స్ కూడా దాంతో అప్పటి నుంచే ఇద్దరికీ సినిమాలంటే చాలా ఇష్టం ఉండేదట ఒకరు చదివిన బుక్ ఇంకొకరు తీసుకొని చదివే వాళ్లంట ఆలా అప్పటి నుంచే ఇద్దరికీ బుక్స్ అన్న సినిమాలు అన్న చాలా ఇష్టం ఉండేదట దింతో త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చాక త్రివిక్రమ్ ద్వారా అబ్బూరి రవి కూడా ఇండస్ట్రీ కి వచ్చి సినిమాలకి మాటల రచయిత గా చేస్తున్నాడు.

అయితే రవి కి మొదట సినిమా డైలాగ్స్ అంటే ఏంటి, స్టోరీ అంటే ఏంటి అవి ఎలా రాయాలి అనేవి సరిగ్గా తెలియక పోయేదట అప్పుడు త్రివిక్రమ్ కూర్చోబెట్టి కథ అంటే ఏంటి దాన్ని ఎలా రాయాలి, డైలాగ్ అంటే ఏంటి దాన్ని ఎలా రాస్తే అది జనాల్లోకి వెళ్తుంది అనే విషయాలన్నీ చాలా క్లియర్ గా చెప్పాడట దాంతో సినిమా మీద అబ్బూరి రవి కి ఒక క్లారిటీ వచ్చిందట అలా తాను కూడా రైటర్ గా మారాడు అబ్బూరి రవి త్రివిక్రమ్ గురించి చెపాల్సి వచ్చినపుడు ఇప్పటికి కూడా త్రివిక్రమ్ లేకపోతే నేను ఈ స్థాయి లో ఉండేవాణ్ణి కాదు త్రివిక్రమ్ నా గురువు, నా ఫ్రెండ్ నాకు అన్ని వాడే అని త్రివిక్రమ్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు.

Advertisement
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

తాజా వార్తలు