వింట‌ర్‌లో చ‌ర్మాన్ని ర‌క్షించే జామ..ఎలాగంటే?

వింట‌ర్ సీజ‌న్ ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌డం క‌త్తి మీద సామే.

కానీ, జామ‌తో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే గనుక‌.చాలా అంటే చాలా సుల‌భంగా చ‌ర్మాన్ని కాపాడుకోవ‌చ్చు.

అలాగే జామ‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను సైతం నివారిస్తుంది.మ‌రి ఆల‌స్య‌మెందుకు జామ‌ను చ‌ర్మానికి ఎలా వాడాలి.? అస‌లు జామ వ‌ల్ల ల‌భించే స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాలపై ఓ లుక్కేసేయండి.ఈ సీజ‌న్‌లో చాలా మంది పొడి చ‌ర్మం, ముడ‌త‌లు వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేస్తుంటారు.

అయితే అలాంటి వారు ఒక జామ పండు, నాలుగు జామ ఆకులు తీసుకుని క‌లిపి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక ఎగ్ వైట్‌, అర స్పూన్ బాదం ఆయిల్ యాడ్ చేసి.

Advertisement

ముఖానికి ప‌ట్టించాలి.ఆపై ప‌ది లేదా ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.

అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే చ‌ర్మం తేమ‌గా మారుతుంది.

అదే స‌మ‌యంలో ముడ‌త‌లూ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే ఒక జామ పండు, అర క‌ప్పు క్యారెట్ ముక్క‌లు తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.అందులో స్పూన్ పెరుగు, స్పూన్ తేనె క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు పూసి.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బాగా డ్రై అయిన త‌ర్వాత నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.

Advertisement

స్కిన్ డ్రై అవ్వ‌కుండా ఉంటుంది.మ‌రియు స్కిన్ టోన్ సైతం మెరుగు ప‌డుతుంది.

ఇక అరటి పండు, జామ పండ్లను సమానంగా తీసుకొని మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో అర స్పూన్ పాల పొడి, రెండు స్పూన్ల పాలు క‌లిపి మిక్స్ చేసుకుని.

ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకోవాలి.అనంత‌రం కాసేపు ఆర‌నిచ్చి.

అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో శుభ్ర ప‌రుచుకోవాలి.ఇలా చేస్తే చర్మం తాజాగా, గ్లోగా మారుతుంది.

డార్క్ స‌ర్కిల్స్ త‌గ్గుతాయి.మ‌రియు చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది.

తాజా వార్తలు