ముఖాన్ని మెరిపించే మొక్క‌జొన్నపిండి.. ఎలాగంటే?

ముఖం అందంగా, ఆక‌ట్టుకునేలా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా మార్కెట్‌లో దొరికే అనేక ఫేస్ క్రీములు, లోష‌న్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేసి.వినియోగిస్తుంటారు.

అయితే వీటిలో అనేక ర‌సాయ‌నాలు ఉండ‌డం వ‌ల్ల‌.భ‌విష్య‌త్తులో ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకు స‌హ‌జ‌సిద్ధంగానే చ‌ర్మాన్ని మెరిపించుకోవాలి.అయితే ముఖ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలో మొక్క‌జొన్నపిండి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Wonderful Benefits Of Corn Flour Face Packs! Corn Flour, Corn Flour Face Packs,

మ‌రి మొక్క‌జొన్నపిండి ముఖానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మొక్క‌జొన్నపిండిలో కొద్దిగా పెరుగు వేసి.

ముఖానికి, మెడ‌కు అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చ‌ర్మంపై మృత‌క‌ణాలు తొల‌గి.ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

Wonderful Benefits Of Corn Flour Face Packs Corn Flour, Corn Flour Face Packs,

అలాగే మొక్క‌జొన్నపిండిలో కొద్దిగా రోజ్‌వాట‌ర్‌, ప‌సుపు వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.రెండు నిమిషాల పాటు మాసాజ్ చేయాలి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ప‌ది నిమిషాల పాటు ఆర‌నిచ్చి.అనంత‌రం గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గ‌డంతో పాటు.ముఖం మృదువుగా కూడా మారుతుంది.

ఇక జిడ్డు చ‌ర్మం వారికి కూడా మొక్క‌జొన్న‌పిండి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అందుకు ముందుగా మొక్క‌జొన్న‌పిండిలో కొద్ది తేనె వేసి మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరువెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముఖంపై జిడ్డు తొల‌గ‌డంతో పాటు.

ముడ‌త‌లు కూడా త‌గ్గుతాయి.

తాజా వార్తలు