ఆంధ్రప్రదేశ్లో వారసురాళ్ళ హవా మొదలైందా?

ఆంధ్రప్రదేశ్ బిజెపి( BJP ) రాజకీయాల్లో నాయకత్వం మార్పు జరిగింది.

సోము వీర్రాజును( Somu Veerraju ) నాయకుడిగా తప్పించి స్వర్గీయ ఎన్టీ రామారావు కుమార్తె కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ( Purandeshwari ) బాధ్యతలకు చెప్పారు.

చిన్నమ్మగా అందరూ పిలుచుకునే పురందేశ్వరి వాక్చాతుర్యంతో పాటు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న నేత .సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకే అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పిన భాజపా మొదటిసారి ఆ లెక్కలను తోసిరాజని కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరికి బాధ్యతలు అప్ప చెప్పడం వెనక తెలుగుదేశానికి కొమ్ముకాసే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆమె తనకున్న పరిచయాలతోనూ

Womer Leaders Purandeshwari And Ys Sharmila Ship In Andhra Pradesh Will Workout

తన సామాజిక వర్గ సమీకరణాలతోనూ తెలుగుదేశం పార్టీ నీ చీల్చి కొంతమంది కీలక నేతలను భాజాపా వైపు మళ్ళించి భాజపాకు పునర్ వైభవం తీసుకొస్తారని నమ్మకమే కారణమని విశ్లేషణలు వచ్చాయి.మరొకపక్క కాంగ్రెస్ కూడా దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెకు( YS Sharmila ) ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్ను తమ నాయకత్వ లక్షణాలతో సంక్షేమ కార్యక్రమాలతో కీలకమైన ముద్ర వేసిన ఈ ఇద్దరు నేతల కుమార్తెలకు ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు రావడం యాదృచ్ఛికమే అయినా ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుమార్తెలహవా మొదలైనట్లుగా చెప్పవచ్చు.

Womer Leaders Purandeshwari And Ys Sharmila Ship In Andhra Pradesh Will Workout

షర్మిలా కనక కాంగ్రెస్ బాధ్యతలు అందుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం దక్కుతుందని ఉండవల్లి లాంటి రాజకీయ మేధావులువాఖ్యానించడం గమనార్హం.షర్మిల తో ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న కేవీపీ రామచంద్ర రెడ్డి( KVP Ramachandra Reddy ) లాంటి కీలక నేత కన్ఫర్మ్ చేయడంతో షర్మిల కాంగ్రెస్ ప్రయాణం లాంచడమే అని వార్తలు వస్తున్నాయి.మరి తెలుగు రాజకీయాలపై ఇద్దరి కుమార్తెల ప్రభావం ఎంతవరకు ఉంటుందో గడిచే కాలంలో తెలుస్తుంది.

Advertisement
Womer Leaders Purandeshwari And Ys Sharmila Ship In Andhra Pradesh Will Workout
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

తాజా వార్తలు