గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీంతో మీ బంగారంపై వడ్డీ పొందండిలా!

సాధారణంగా మనం గోల్డ్‌ లాకర్లలలో పెట్టుకుంటే దానికి నామినల్‌ ఛార్జీలు కట్టాలి.కానీ, ఈ పథకం ద్వారా మన బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసినా, ఎటువంటి డబ్బును కట్టాల్సిన అవసరం లేదు.

డిపాజిట్‌ చేసినందుకు సావరింగ్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) ద్వారా డిపాజిటర్‌కే 2.50 శాతం వడ్డీ అందిస్తుంది.సాధారణంగా మన ఇళ్లలో ఉపయోగం లేకుండా ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో కొన్ని రోజులపాటు డిపాజిట్‌ చేస్తే బదులుగా మెచురిటీ సమయానికి వడ్డీ పొందుతారు.

ఆర్‌బీఐ ఆమోదం పొందిన బ్యాంకుల్లో ఈ స్కీంలో డిపాజిట్‌ చేయవచ్చు.ఐసీఐసీఐ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెడీఎఫ్‌సీ బ్యాంక్, యేస్‌ బ్యాంక్, దేనా బ్యాంక్‌.

బంగారం ధర మార్కెట్‌ రేటుపై ఆధారపడి ఉంటుంది.డిపాజిట్‌ చేసినప్పటి నుంచి బంగారం విలువపై వడ్డీ లెక్కిస్తారు.ఆర్థిక వ్యవహారాల శాఖ వివరాల ప్రకారం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

మన దేశంలోని ఇళ్లు, సంస్థలు కలిగి ఉన్న ఐడిల్‌ బంగారాన్ని సమీకరించడం, ఉత్పాదక ప్రయోజనాలకు వినియోగాన్ని సులభతరం చేయడానికి, దీర్ఘకాలంలో బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం.ఈ ప£ý కంలో దేశంలో ఉండే వ్యక్తి లేదా సంస్థ ఎవరైనా చేరవచ్చు.

Advertisement
With Gold Monitization Scheme Can Earn Interest Easily, 10 Gram Gold Scheme, Gol

జాయింట్‌ డిపాజిట్‌ కూడా అందుబాటులో ఉంది.

With Gold Monitization Scheme Can Earn Interest Easily, 10 Gram Gold Scheme, Gol

దీనికి కనిష్టంగా 10 గ్రాములు, గరిష్టంగా లిమిట్‌ లేదు.ఎంత బంగారమైనా డిపాజిట్‌ చేసుకోవచ్చు.బ్యాంకుల్లో షార్ట్‌ టర్మ్‌ (1–3 ఏళ్లు) బ్యాంక్‌ డిపాజిట్, మీడియం (5–7 ఏళ్లు), లాంగ్‌ టర్మ్‌ (12–15 సంవత్సరాలు) గవర్నమెంట్‌ డిపాజిట్‌ స్కీం (ఎంఎల్‌టీజీడీ) అందుబాటులో ఉన్నాయి.

డిపాజిట్‌ మెచూరిటీ అయిన తర్వాత ఒకరు అందుకున్న బంగారం డిపాజిట్‌ చేసిన అదే ఫారమ్‌ ఒకే విధంగా ఉండదు.డిపాజిట్‌ చేసిన బంగారం విలువ భారతీయ రూపీ పై ఆధారపడి ఉంటుంది.

లేదా బంగారం వ్యాల్యూపై ఆధారపడుతుంది.ప్రీమెచ్యూర్‌ డిపాజిట్‌ల బంగారంపై వడ్డీ బ్యాంకుల అభీష్టానంపై ఆధారపడి ఉంటుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?

మొత్తంలో కొంత భాగం మాత్రం ప్రీమెచూర్‌ రిడీమ్‌ చూసుకుంటే దాని విలువకు తగిన నగదును డబ్బు రూపంలో చెల్లిస్తారు.

Advertisement

తాజా వార్తలు