కొరటాల శివ క్లారిటీతో మెగా ఫ్యాన్స్ కూల్ అవుతారా.. దేవరకు సపోర్ట్ లభిస్తుందా?

మరికొన్ని రోజుల్లో దేవర సినిమా( Devara Movie ) రిలీజ్ అవుతుండటంతో అభిమానులకు ఒకవైపు సంతోషం కలుగుతుండగా మరోవైపు టెన్షన్ కొనసాగుతోంది.

ఆచార్య సినిమా( Acharya Movie ) ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ కొరటాల శివను( Koratala Siva ) టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే చిరంజీవితో ఎలాంటి విబేధాలు లేవని కొరటాల శివ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.చిరంజీవితో( Chiranjeevi ) తనకు మంచి సంబంధాలే ఉన్నాయని కొరటాల ఇప్పటికే చెప్పేశారు.

Will Mega Fans Support Devara Movie Details, Devara Movie, Director Koratala Siv

దేవర సినిమాతో సక్సెస్ సాధిస్తావని చిరంజీవి నుంచి ఆశీర్వాదం లభించిందని కొరటాల శివ పేర్కొన్నారు.అయితే చిరంజీవికే కొరటాల శివపై పాజిటివ్ అభిప్రాయం ఉన్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్( Mega Fans ) కొరటాల శివ విషయంలో కూల్ అవుతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది.సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్ ఖాతాలో ఫ్లాపులు ఉన్నాయి.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి ఒకరిద్దరు డైరెక్టర్లు మాత్రమే నూటికి నూరు శాతం సక్సెస్ లో ఉన్నారు.

Will Mega Fans Support Devara Movie Details, Devara Movie, Director Koratala Siv
Advertisement
Will Mega Fans Support Devara Movie Details, Devara Movie, Director Koratala Siv

చిరంజీవికి సైతం ఆచార్య, భోళా శంకర్ సినిమాల ఫలితాలు ఒకింత భారీ షాకిచ్చాయనే సంగతి తెలిసిందే.కొరటాల శివ దేవరకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ సైతం లభిస్తే ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి.కొరటాల శివ కెరీర్ ను సైతం దేవర డిసైడ్ చేయనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొరటాల శివ దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.ప్రీ సేల్స్ తోనే దేవర సినిమాకు ఇప్పటివరకు 50 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

సినిమా రిలీజ్ కు మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది.దేవర సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కొరటాల శివ తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు