Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్ ఏపీలోని ఆ రాజకీయ పార్టీకి మద్దతిస్తారా.. కృష్ణ తమ్ముడు పోటీ చేస్తుండటంతో?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) రాజకీయాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేయడానికి ఆయన ఇష్టపడరు.

ఒకవైపు సినిమాలతో మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్న మహేష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.అయితే 2024 ఎన్నికల్లో మహేష్ ఫ్యాన్స్ టీడీపీ జనసేనలకు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు( Aadi seshagiri rao ) టీడీపీ తరపున పని చేస్తారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.ప్రత్యక్ష రాజకీయాలపై ఆది శేషగిరిరావుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.గతంలో వైసీపీ, కాంగ్రెస్ లలో పని చేసిన ఆది శేషగిరిరావు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏపీపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం టీడీపీకి ఎంతో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

Advertisement

2024 ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది.ఆది శేషగిరిరావు టీడీపీ తరపున పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఆది శేషగిరిరావు కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

టీడీపీ జనసేన( TDP,Janasena ) జాబితా నేడు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.మరోవైపు మహేష్ జక్కన్న సినిమాతో బిజీగా ఉన్నారు.

మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది.మహేష్ జక్కన్న హాలీవుడ్ లెవెల్ లో సినిమా సక్సెస్ సాధించేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న సినిమాకు బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేవని సమాచారం అందుతోంది.మహేష్ జక్కన్న కాంబో మూవీ రెగ్యులర్ షూట్ సమ్మర్ తర్వాత మొదలుకానుందని అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్స్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరగనున్నాయని భోగట్టా.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు