సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేసే వరకు సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని సిపిఎం హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు.
శనివారం సిపిఎం బృందంతో కలసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేసి అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన పేదలందరికీ పూర్తి చేసి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నా ముగ్గురు కాంట్రాక్టర్లు మారినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తికాలేదని,కంపచట్లతో శిధిలమయ్యే పరిస్థితి ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల బతుకులు మారతాయని,ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ప్రజలు ఆలోచిస్తున్నారని,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి ఇవ్వాలి లేకుంటే సిపిఎం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామన్నారు.సీతారాంపురం గ్రామంలో ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు జీవనం సాగిస్తున్నారని,ప్రభుత్వం వెంటనే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మాణం చేపట్టి అర్హులైన ప్రజలను ఇవ్వాలన్నారు.
లేకుంటే సమస్యలను పూర్తయ్యే వరకు ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు సృష్టించడంతోపాటు దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం వాటిల్లే పద్ధతిలో వ్యవహరిస్తుందని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ నిరుద్యోగ సమస్యని పెంచడంతోపాటు దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు ధారాధత్వం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని,ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు డబల్ బెడ్రూం ఇల్లు కట్టివ్వాలని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని మహిళలకు 2500 ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకటచంద్ర, మండల కమిటీ సభ్యులు మాడూరి నరసింహచారి, వెల్లంశెట్టి వీరస్వామి, తంగేళ్ల గోపరాజు,సైదమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు భాస్కర్,జి.
ఉష,రూతమ్మ మంగళపల్లి వెంకటమ్మ, చిలక మారుతి,చిలక సైదులు,ఒగ్గు నాగమణి, పిట్టల యాదమ్మ,గునికంటి లక్ష్మమ్మ,చిలక సావిత్రి,చిలక పిన్నమ్మ,మణెమ్మ మేకపోతుల వీరస్వామి, తురక శీను,బుచ్చయ్య కనకయ్య,తురక మట్టయ్య, బైరా చంద్రయ్య,సామ్రాజ్యం సురేష్,లక్ష్మమ్మ ప్రవీణ్,ఎలక రాజు,కొండలు,రమేష్, కనకయ్య,చంద్రయ్య, మట్టయ్య,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy