పవన్ ఆఫర్‌ను ఈసారైనా ఓకే చేస్తోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.

దాదాపు రెండేళ్ల తరువాత పవన్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ లైన్‌లో పెడుతున్నాడు.ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్ర షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు పవన్.

కాగా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం హాట్ యాంకర్ అనసూయకు వచ్చింది.దీంతో పాటు ఓ అదిరిపోయే హాట్ ఐటెం సాంగ్ కూడా ఈ సినిమాలో ఆమెతో చేయించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

అయితే ఇంకా ఈ ఆఫర్‌ను అమ్మడు ఓకే చేయలేదు.గతంలో కూడా అనసూయకు పవన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

Advertisement

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘ఇట్స్ టైం టు పార్టీ’ అనే పాటలో అనసూయను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆ సమయంలో పవన్ సినిమాను అనసూయ రిజెక్ట్ చేసింది.

దీంతో ఆ పాట వేరే బ్యూటీతో చేయించారు.ఇప్పుడు దర్శకుడు క్రిష్ సినిమాలో మరోసారి పవన్ కోసం ఈ బ్యూటీని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లా్న్ చేస్తుంది.

మరి ఈసారి పవన్ సినిమాలో చేసేందుకు అనసూయ ఓకే అంటుందా లేక మళ్లీ రిజెక్ట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.బుల్లితెరపై బిజీ యాంకర్‌గా ఉన్న అనసూయ వెండితెరపై కూడా చాలా స్పీడుగా దూసుకెళ్తుంది.

ఇప్పటికే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తాజాగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది.మరి పవన్ సినిమాలో అనసూయ కనిపిస్తుందా లేదా అనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు