స్టార్ హీరోలు ఇప్పుడు విలన్లు గా ఎందుకు మారుతున్నారు..?

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్ విలన్ అనే ప్రత్యేకత పోయింది ఎవరికి e సినిమాలో మంచి క్యారెక్టర్ పడింది.

ఆ క్యారెక్టర్ లో ఎంత బాగా ఫార్ఫా మెన్స్ చేశారు అనే దాని మీదనే నటులు సినిమాలని ఒప్పుకుంటున్నారు.

ఇక అందులో భాగం గానే అద్బుతంగా నటిస్తే ఇతర భాషల నటులను సైతం టాలీవుడ్ ప్రేక్షకులను ఆదరిస్తారని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.ఇప్పుడు పాత్రలకి మాత్రం ఇంపార్టెంట్ ఇస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త విలన్ల హవా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.ఇతర భాషల్లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరోలు టాలీవుడ్ లో విలన్లుగా నటిస్తున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండటం గమనార్హం.తమిళనాడులో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న కమల్ హాసన్( Kamal Haasan ) ప్రాజెక్ట్ కే సినిమాలో రోల్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

ప్రభాస్ మారుతి కాంబో మూవీలో సంజయ్ దత్( Sanjay Dutt ) విలన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో విజయ్ సేతుపతి( Vijay Setupathi ) విలన్ గా కనిపిస్తారని సమాచారం అందుతోంది.

పుష్ప 2 సినిమాలో ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) విలన్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్( Pridhviraj Sukumaran ) విలన్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.హరిహర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు.పవన్ సుజీత్ కాంబో మూవీలో ఇమ్రాన్ హష్మీ( Emraan Hashmi ) విలన్ గా కనిపిస్తారని తెలుస్తోంది.

భగవంత్ కేసరి సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.రవితేజ, విశ్వక్ సేన్ కాంబో మూవీలో మనోజ్ విలన్ గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్, ఇతర భాషల విలన్లకు క్రేజ్ పెరుగుతోంది.విలన్ల పారితోషికాలు సైతం భారీ స్థాయిలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.టాలీవుడ్ సినిమాలలో విలన్ రోల్ లో నటించిన వాళ్లకు సినిమా ఆఫర్లు సైతం పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

ఇలా పాత్రలకి మాత్రమే విలువ నిచ్చి సినిమాలు చేస్తే నటులకి కూడా మంచి పాత్రల్లో నటించే స్కోప్ దొరుకుతుంది దానికి తగ్గట్టుగానే వాళ్ల నటన కూడా బయటికి వస్తుంది.

తాజా వార్తలు