రానున్న రోజుల్లో అక్కడ ఇక నైట్‌ షిప్టులు అనేవే ఉండవు... సూపర్ కదూ, ఎక్కడంటే?

నైట్‌ షిప్టులు( Night shifts ) చేయడం వలన సగటు మనిషి ఆయుర్దాయం తరిగిపోతుందని ఓ అధ్యయనం చెబుతోంది.అంతెందుకు ఆరోగ్య నిపుణులు కూడా చాలా రకాల గుండె సంబంధిత జబ్బులకు కారణం నైట్‌ షిప్టులు చేయడమే అని హెచ్చరిస్తున్న పరిస్థితి వుంది.

 There Will Be No More Night Shifts In The Coming Days In Japan, Jobs, Night Shif-TeluguStop.com

కానీ మనకి నేటి దైనందిత జీవితంలో నైట్‌ షిప్టులు చేయడం తప్పనిసరి అవుతుంది.ఎందుకంటే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు ఎక్కువగా యూఎస్ టైమింగ్స్ లోనే ఉంటాయి.

కాబట్టి ఉద్యోగస్తులు ఆ సమయంలో మేలుకొని పని చేయాల్సిన అవసరం వుంది.అయితే, రానున్న రోజుల్లో అక్కడ ఇక నైట్‌ షిప్టులు అనేవే వుండవు.

ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.దాంతో అక్కడి ప్రజలు పండగ చేసుకుంటున్నారు.

ఈ పరిణామం మనదగ్గర మాత్రం కాదండోయ్.ఓ జపాన్ కంపెనీ తీసుకున్న సంచలన నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోందని తెలుస్తోంది.

దాన్నే ఇప్పుడు జపాన్( Japan ) ప్రభుత్వ అడాప్ట్ చేసుకోనుంది.రాత్రి 8 గంటల తర్వాత ఎవరూ పని చేయడానికి వీల్లేదని చెప్పింది.

Telugu Employees, Fertility, Japan, Jobs, Shifts, Private Company-Telugu NRI

విషయం ఏమిటంటే పడిపోతున్న సంతానోత్పత్తిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇటోచు కార్పరేషన్ కంపెనీకి మసహిరో ఒకఫుజి 2010లో సీఈవోగా బాధ్యతలు తీసుకున్న తరువాత జపాన్లోని పెద్ద కంపెనీలకు దీటుగా తన కంపెనీని వృద్ధి పథంలో నడిపించారు.ఈ క్రమంలోనే మసహిరో ఒకఫుజి ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టడం జరిగింది.రాత్రి 8 గంటల తర్వాత పని చేయొద్దని ఉద్యోగులకు చెప్పారు.

Telugu Employees, Fertility, Japan, Jobs, Shifts, Private Company-Telugu NRI

ఈ నేపథ్యంలో సెక్యూరిటీ గార్డ్ నుంచి తన డెస్క్ ఉద్యోగుల వరకు అందర్నీ రాత్రి 8 గంటలకి ఇంటికి వెళ్లిపోమని చెప్పడం గమనార్హం.అదనపు పని అనేది అస్సలు చేయవద్దని తేల్చి చెప్పారు.ఒక వేళ పని పెండింగ్లో ఉంటే మాత్రం ఉదయం ఎర్లీగా వచ్చి ఫినిష్ చేయాలని సూచించారు.దీని కూడా అదనంగా చెల్లిస్తామని చెప్పారు.దాంతో సీఈవో తీసుకున్న డెసిషన్ వర్కౌట్ అయింది.పదేళ్ల తర్వాత కంపెనీ ఊహించినదాని కంటే ఎక్కువ వృద్ధిలోకి వచ్చింది.

ఫ్యామిలీమార్ట్ కన్వీనియన్స్ స్టోర్ నుంచి మెటల్స్ ట్రేడింగ్ వరకు వ్యాపించింది.ఉద్యోగులు కూడా 5 రెట్లు లబ్ధి పొందినట్టు సమాచారం.

ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకుని, పిల్లలను కని తిరిగి పనికి రావడానికి ఆసక్తి చూపించారు.ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కంపెనీల్లో నైట్ షిఫ్టులను బ్యాన్ చేయడం జరిగింది.

త్వరలోనే ఇలాంటి నిబంధనలను పలు దేశాలు కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube