మలయాళం సినిమా రీమేక్ అంటే హిట్ కొట్టినట్టేనా ? తెలుగు లో రైటర్స్ ఎక్కడ ..?

హిట్టు అయ్యిన ప్రతి మలయాళీ సినిమాను రీమేక్ చేసి వేరే భాషలో కూడా హిట్టు కొట్టచ్చు అనుకోవడం లో ఉన్న భ్రమ మరొకటి లేదు.

అస్సలు చాల మళయాళ సినిమాలు తెలుగు లో వచ్చి బొక్క బోర్లా పడ్డాయి.

ఓటిటి పుణ్యమా అని మలయాళం అయినా మరొక బాషా అయినా కూడా సబ్ టైటిల్స్ తో చూడటానికి జనాలు బాగా ఇష్టపడుతున్నారు.ఆలా ప్రతి సినిమాను చూసేసి మర్చిపోలేక రీమేక్ పేరుతో మళ్లి జనాల మీద రుద్దడం అనేది ఎంత వరకు కరెక్ట్.

పోనీ డబ్బింగ్ చేస్తే సరిపోయే సినిమాను రీమేక్ చేసి కోట్లు తగలబెట్టడం వెనక ఆంతర్యం ఏమైనా ఉందా అంటే అది లేదు.ఇక మలయాళం రీమేక్ ల విషయానికి వాశి అయ్యప్పనుం కోషియం అనే సినిమాను పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పేరు తో విడుదల చేసి ఓ మోస్తరు హిట్ కొట్టాడు.

దృశ్యం లాంటి కథలో దమ్మున్న సినిమాలకు తప్ప ఏది పడితే అది చూస్తారు అనుకోవడం పెద్ద పొరపాటు.పైగా లూసిఫర్ రీమేక్ ని నేటివిటీ కి తగ్గట్టు గా మార్చి తీయడం వల్ల చిరంజీవికి ఒరిగింది ఏమి లేదు.

Advertisement
Why Only Malayali Remake Movies Are Coming , Malayali Remake Movies ,Pawan Kalya

ఇది కాకండా ఆ మాద్య అనేక మలయాళ సినిమాలు తెలుగులో కనిపించి పోయాయి.రాజశేఖర్ శేఖర్ అనే పేరు తో తీసిన సినిమా మలయాళ జోషేప్ చిత్రం.

ఇది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు.

Why Only Malayali Remake Movies Are Coming , Malayali Remake Movies ,pawan Kalya

ఇక కప్పెల సినిమాను బుట్టబొమ్మ గా తీస్తే తెలుగు లో దేకినోడు లేడు.ఇష్క్ సినిమాను అదే పేరు తో తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ తీస్తే అది కూడా అట్టర్ ఫ్లాప్.హంట్ అనే పేరుతో మొన్నటికి మొన్న సుధీర్ బాబు ఒక సినిమా తీసాడు.

చిత్రం ముంబై పోలీస్ అనే పేరు తోవచ్చి సూపర్ హిట్ అయ్యింది కానీ సుధీర్ బాబు ఎలాంటి పేరును తేలేకపోయింది.

Why Only Malayali Remake Movies Are Coming , Malayali Remake Movies ,pawan Kalya
ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

మలయాళ మాతృక డ్రైవింగ్ లైసెన్స్ ని హిందీ లో సెల్ఫీ అని తీయగా అది అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్.మరి ఈ మాత్రం ఫ్లాప్ సినిమాలకు మన తెలుగు కథకులు సరిపోరా ? ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్, కాంతారా వంటి సినిమాలు ఒక భాషలో తీసి అన్ని భాషలో డబ్ చేసి వదలలేదా ? ఇక మలయాళం అయినా ఇంకో వేరే బాషా అయినా ఆ సినిమాలోని ఆత్మను పెట్టుకోకుండా కేవలం తీశామా అంటే తీసాం అని తీస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు