ఇంత గొప్ప కల్ట్ క్లాసిక్ సినిమ ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?

మహర్షి( Maharshi ). ఈ పేరు చెప్పగానే ఇప్పుడు ఎవరికైనా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమానే గుర్తు వస్తుంది.

కానీ ఇదే పేరుతో సీనియర్ దర్శకుడు వంశీ( Senior Director Vamsi ) ఒక సినిమా తీశారు.ఇప్పటి వారికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1987లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పవచ్చు.

ఈ సినిమాలోని పాటలు అలాగే హీరోగా నటించిన రాఘవ గారి( Hero Raghava ) పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.ఇక మహర్షి సినిమాకి సంగీతం అందించింది ఇళయరాజా.

ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు.సినిమాలో అప్పుడప్పుడు హీరోయిన్ గా అడుగులు వేస్తున్న భానుప్రియ చెల్లెలు నిశాంతి హీరోయిన్ గా నటించింది.

Advertisement

సినిమా విడుదలై దాదాపు 25 ఏళ్లు గడిచిపోయిన దీని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఇది సృష్టించిన అలజడి అంతా కాదు.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు.అప్పట్లో ఈ సినిమా ఎందుకు ఆడలేదు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది.సినిమాలో నటించిన రాఘవ పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి ఇలాంటి ఒక నటుడు ఎందుకు పెద్ద హీరో కాలేకపోయాడు అని బాధేస్తూ ఉంటుంది.

ఇప్పటికీ టీవీలో సినిమా వస్తే అలాగా చూస్తూ ఉండిపోతారు గుండె వెయ్యి టన్నుల బరువెక్కిన ఫీలింగ్ ఉంటుంది కానీ ఎందుకో ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.అయితే అప్పట్లో మహర్షి సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బెస్ ఉండేది అలాగే అందులో హీరోగా నటించిన రాఘవ గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది.

ఇక ఈ సినిమా పరాజయానికి ముఖ్యంగా హీరోయిన్ మాత్రమే కారణం అని అనిపిస్తుంటుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రతిసారి అంతగా ప్రేమిస్తున్నా ఒక వ్యక్తిని హీరోయిన్ నిశాంతి( Heroine Nishanthi ) ఎందుకు ప్రేమించడం లేదు అనే పాయింట్ అర్థం కాలేదు.పైగా భానుప్రియ చెల్లి అనగానే అందరూ ఆ రేంజ్ నటనను ఎక్స్పెక్ట్ చేస్తారు.ఆ అందాన్ని అందుకోవడంలో అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె విఫలమయ్యింది.

Advertisement

పైగా మహర్షిని నిరాకరించడంలోని పాయింట్ కూడా జనాలకు కనెక్ట్ కాలేకపోయింది.అందువల్ల ఏ సినిమా పరాజయం ఫాలో అయింది అని అనుకుంటూ ఉంటారు.

కుదిరితే ఓసారి యూట్యూబ్ లో ఈ సినిమాను మళ్ళీ చూడండి క్లైమాక్స్ లో ఖచ్చితంగా మరో మారు కళ్ళు చెమ్మగిళ్ళకుండా ఉండవు.

తాజా వార్తలు