ఈ నంద‌మూరి హీరో వెండి తెరకు ఎందుకు దూరం అయ్యాడో తెలుసా?

నంద‌మూరి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి. ఈ పేరు పెద్దగా పరిచయం లేదే అనుకుంటున్నారా? సినిమాలతో బాగా పరిచయం ఉన్నవారికి ఈయన గురించి కాస్త తెలిసే అవకాశం ఉంటుంది.

లంకేశ్వ‌రుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి బావ‌గా, రేవతి భ‌ర్త‌గా న‌టించాడు చూడండి.

తనే ఈ క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి.ఈ సినిమాతో పాటు ఇంటి దొంగ‌, రౌడీ బాబాయ్‌, దొంగ కాపురం సినిమాల్లో చక్కటి నటనతో మంచి జనాదరణ పొందాడు.తను మున్ముందు టాప్ హీరోగా ఎదిగే అవకాశం ఉంది అనుకుంటున్న సమయంలో తను అనుకోకుండా వెండి తెరకు ఎందుకు దూరం అయ్యాడు? అని జనాలకు అనుమాలను కలుగుతుంది.ఇంతకీ తను ఎందుకు కనిపించడం లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నట శిఖరం నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్ర‌మ‌రావు కొడుకే ఈ క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి.త్రివిక్ర‌మ‌రావు నిత్యం అన్న‌య్య వెంటే ఉండేది.

ఆయనతో కలిసి పలు సినిమాలు నిర్మించాడు కూడా.చిన్నతనం నుంచి పెద్దనాన్న, నాన్నను చూస్తూ పెరిగిన కల్యాణ్.

Advertisement

సహజంగానే హీరోగా మారాడు.తన తండ్రి మాటను జవదాటే వాడు కాదు తను.ఆయన ఏ పని చెప్తే అది చేసేవాడు.తనను సినిమాల్లో నటించాలని చెప్పింది కూడా తన తండ్రే.

అంతే కాదు.సినిమా కథల దగ్గర నుంచి, పాత్రల ఎంపిక దాకా అన్నీ తనే దగ్గరుంచి చూసుకునే వాడు.

కల్యాణ్ సినిమా చేయాలంటే ముందు తన తండ్రి ఆ స్టోరీ వినాల్సిందే.ఆయనకు ఓకే అనిపిస్తేనే సినిమా.

లేదంటే నో.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
ఆ విషయంలో చిరంజీవి బాలకృష్ణ సేమ్ టూ సేమ్.. బాబీ కామెంట్స్ వైరల్!

క‌ల్యాణ్ చాలా వరకు నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేశాడు.అందుకే ముందుగా ఫ్యామిలీ స్టోరీలతో సినిమాలు చేశాడు.అక్షింత‌లు, త‌లంబ్రాలు, ఇంటిదొంగ‌, దొంగ కాపురం, మేన‌మామ‌ లాంటి ఫ్యామిలీ సినిమాలో జనాలకు దగ్గరయ్యాడు.

Advertisement

ఆ తర్వాత రౌడీ బాబాయ్‌, రుద్ర‌రూపం లాంటి యాక్ష‌న్ సినిమాల్లో నటించాడు.మూవీస్ భక్త క‌బీర్‌దాస్‌ సినిమాలో శ్రీ‌రాముడిగా క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి నటించాడు.ఆ తర్వాత లంకేశ్వరుడు సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.

ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు.

దానికి కారణం తన కొడుకు పృథ్వీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.అదే ప్రమాదంతో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ షాక్ తో తను సినిమాలకు దూరం అయ్యాడు.

తన తండ్రి చనిపోయాక చెన్నైలోని తన వ్యాపారలనుచూసుకుంటూ ఉన్నాడు.ఆ త‌ర్వాత చిత్ర‌ప‌రిశ్ర‌మ మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌చ్చినా, త‌ను మాత్రం తండ్రితో అక్‌ిడే ఉండిపోయాడు క‌ల్యాణ్‌.

పెద‌నాన్న కుటుంబం, ఆయ‌న కుమారులు అంతా హైద‌రాబాద్‌కు వ‌చ్చేసినా, తండ్రి చ‌నిపోయాక కూడా ఆయ‌న చెన్నైని వ‌దిలి పెట్ట‌లేదు.అక్క‌డే వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయాడు.

తాజా వార్తలు